దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ – మూడో వేవ్ విజృంభణ.

కరోనా వైరస్‌ను కట్టడి చెయ్యడంలో ‘రోల్ మోడల్‌’గా నిలిచిన కేరళలో   వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.   కొత్త కేసుల సంఖ్య  అమాంతం పెరిగింది. ఒక్క‌రోజే కేర‌ళ‌లో కొత్త‌గా 22,129 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. పాజిటివిటీ రేటు కూడా 12.35 శాతానికి పెరిగింది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది.  నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

coronavirus economic impact royalty free image 1588623164కేరళలోని సముద్రతీర ప్రాంతాల్లో ఒక్కసారిగా అనేక కోవిడ్-19 కేసులు బయటపడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అరేబియా సముద్ర తీర ప్రాంతంలో దాదాపు నాలుగు వేల మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ నెల మొదట్లో ఈ గ్రామంలో 100కు పైగా కోవిడ్-19 కేసులు బయటపడ్డాయి. స్థానికంగా ఉన్న చేపల బజారుకు వెళ్లినవారివల్ల ఈ వైరస్ సామాజిక వ్యాప్తి చెంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

దేశం మొత్తం మీదా దాదాపు 43 వేల కేసులు న‌మోదు కాగా అందులో ఏకంగా 50 శాతానికి మించిన వాటా కేర‌ళ‌దే కావ‌డం గ‌మ‌నార్హం. ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు వంటి మ‌ధ్య స్థాయి కేసులు న‌మోదైన రాష్ట్రాల్లో కూడా ఈ వారంలో కేసుల సంఖ్య మ‌రింత త‌గ్గుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు 1500 స్థాయిలో రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే గ‌త కొన్నాళ్లుగా కేసుల సంఖ్య‌ను పెరుగుతున్న కేర‌ళ‌లో మూడో వేవ్ దాదాపు వ‌చ్చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఒక్క‌రోజే 156 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇవాళ కొత్త‌గా 13,415 మంది క‌రోనా వైర‌స్ బారినుంచి కోలుకున్నారు. దాంతో అక్క‌డ మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 31,43,038 కి చేరింది. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రం మొత్తంలో 1,45,371 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

తిరువనంతపురం జిల్లాలోని కోస్తా ప్రాంతమైన పూంతుర గ్రామంలో మళ్లీ పూర్తి లాక్‌డౌన్ విధించారు. ఆ ప్రాంతానికి రాకపోకలు నిషేధిస్తూ, రవాణా సౌకర్యాలు నిలిపివేసారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటరాకూడదని, వ్యాపారాలు, దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.