ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ.. నిత్యం మన కళ్ల ముందే మెదిలే తల్లిదండ్రులే దైవంతో సమానం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు వారే ప్రపంచం అవుతారు. తమకు ఉన్నంతలో బిడ్డలను బాగా చూసుకోవాలని ఆశిస్తారు. తాము తిన్నా తినకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. బిడ్డలే లోకంగా బతికి.. వారి కోసం ఒంట్లోని శక్తినంతా దారపోసి.. పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దితే.. అవసాన దశలో ఆ తల్లిదండ్రులకు నాలుగు మెతుకులు పెట్టడానికి మనసొప్పని బిడ్డలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వారిని కనీసం మనుషులుగా కూడా చూడరు. ముసలి తల్లిదండ్రులను భారంగా భావించి.. వారిని వృద్ధాశ్రమాలు, రోడ్డు పక్కన వదిలేసి చేతులు దులుపుకుంటారు. భూమ్మీద అందరూ ఇలానే ఉంటే.. ఈ పాటికే మానవజాతి కనుమరుగయ్యేది. కసాయి మనుషులున్న ఈ లోకంలో తల్లిదండ్రులను దైవాలుగా భావించే మంచి మనుషులు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వృద్ధాప్యంలో ఉండి.. నడవలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను తన భుజాల మీద మోస్తున్న ఓ వ్యక్తి వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. శ్రవణ కుమారుడి కథ తెలుసా.. దీనిలో శ్రవణుడు అంధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని.. తన భుజాల మీద మోస్తూ.. వారిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇప్పుడు మీరు చూడబోయే కథనం కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడ ఓ వ్యక్తి.. తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని.. కన్వార్ యాత్రకు తీసుకెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అశోక్ కుమార్ ఐపీఎస్ అనే అధికారి తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రసుత్తం ఇది గె ట్రెండ్ అవుతోంది. ‘‘ప్రస్తుత రోజుల్లో ముసలి తల్లిదండ్రులను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నారు.. తమ బిడ్డలతో కలిసి ఉండనివ్వటం లేదు. కానీ ఈ రోజు నేను మరో కోణాన్ని చూశాను. కన్వార్ యాత్రకు వెళ్తున్న లక్షలాది శివయ్య భక్తుల్లో.. నాకు ఈ అభినవ శ్రవణుడు కనిపించాడు. అతడు వృద్ధులైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చొబెట్టుకుని.. యాత్రకు తీసుకెళ్తున్నాడు. అతడికి నా సెల్యూట్’’ అంటూ ఇందుకు సంబంధించి వీడియోని పోస్ట్ చేశాడు. ఇక క్షణాల వ్యవధిలోనే ఇది వైరల్గా మారింది. సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ‘‘ఈ జనరేషన్లో నీలాంటి కుమారుడు ఉండటం వారి అదృష్టం’’.. ‘‘తల్లిదండ్రులు నిన్ను కడుపున మోస్తే.. నువ్వు.. వారిని భుజాలపై మోస్తున్నావ్.. హ్యాట్సాఫ్’’.. ‘‘నీకు సెల్యూట్’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వ్యక్తి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. जहां आजकल बूढ़े मां-बाप का तिरस्कार होता है, उन्हें घर से निकाल दिया जाता है या अपने साथ रहने नहीं दिया जाता.. वहीं आज इसका विपरीत दृश्य देखने को मिला.. लाखों शिवभक्तों के बीच एक श्रवण कुमार भी है जो पालकी में अपने बुज़ुर्ग माता-पिता को लेकर कांवड़ यात्रा पर आया है.. मेरा नमन! pic.twitter.com/phG1h3pfg1 — Ashok Kumar IPS (@AshokKumar_IPS) July 19, 2022 ఇది కూడా చదవండి: Udupi: టోల్ గేట్ వద్ద ప్రమాదం.. పేషేంట్ తో సహా అంబులెన్స్ నుండి ఎగిరిపడిన ఫ్యామిలీ! ఇది కూడా చదవండి: వీడియో: నేషనల్ హైవేపై అలవోకగా లారీ నడిపిన మహిళ.. ఆమె కాన్ఫిడెన్స్పై నెటిజనుల ప్రశంసలు!