ఎకో ఫ్రెండ్లీ : నిమజ్జనం అయ్యాక ఎరువుగా మారే గణపతి!!.

వినాయక చవితి నేపథ్యంలో ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి చెందిన కాంత యాదవ్ ఆవుపేడతో పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు తయారు చేశారు. హిందూ సంస్కృతితో ఆవుపేడను పవిత్రంగా భావిస్తుంటారు. అందుకే ఎండిన ఆవుపేడతో కలప దుమ్ము, మైదా పొడి కలిపి మిశ్రమాన్ని వినాయకుడి అచ్చులో పోసి విగ్రహాన్ని తయారు చేశామని  15 నిమిషాల్లోనే తయారు చేసిన ఈ విగ్రహాలు ఆరబెట్టడానికి నాలుగైదు రోజులు పడుతోంది. కళాకారుడు కాంతయాదవ్ చెప్పారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఆవు పేడతో చేసిన వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు జనం ఎగబడుతున్నారు.

Eco Friendly Lord Ganesh 01 minభోపాల్‌లో కాంత యాదవ్ మరియు ఆమె కుటుంబం ఆవు పేడతో చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలకు ప్రజలలో మంచి డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా వినాయక సందడి షురూ అయింది. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో హోరెత్తిపోతోంది. ఎటు చూసినా వీధులన్నీ గణనాథుని విగ్రహాలతో కళకళలాడుతున్నాయి. ప్రతిమల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. గతేడాది కరోనాతో ఉత్సవాలకు దూరమైన ప్రజలు.. ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.  వినాయక చవితి నేపథ్యంలో ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది.

చవకగా లభిస్తున్న ఆవుపేడ వినాయక విగ్రహాలకు ప్రజల నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. భోపాల్ నగరం నుంచి కాకుండా పూణే, ఢిల్లీతో సహా పలు ప్రాంతాల నుంచి తమకు విగ్రహాల కోసం ఆర్డర్లు వచ్చాయని కాంతయాదవ్ చెప్పారు.దేశంలోని ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఆవు పేడతో తయారు చేసిన ఈ వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడం ద్వారా సంప్రదాయాన్ని పాటించాలని కాంత యాదవ్ కోరారు. నిమజ్జనం చేసిన తర్వాత విగ్రహాలను ఎరువుగా కూడా ఉపయోగించవచ్చునని కాంత యాదవ్ వివరించారు.