చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు కుక్కలని పెంచుకుంటారు. తమ యజమాని పట్ల అవి ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. యజమానికి కష్టమొస్తే కన్నీళ్లు పెట్టుకుంటాయి. యజమాని చనిపోతే మనుషుల కంటే ఘోరంగా బెంగ పెట్టుకునే జంతువులు ఉన్నాయి. జంతువులని ప్రేమించాలే గానీ అవి ప్రేమించినంత గొప్పగా మనుషులు కూడా ప్రేమించరు. ప్రేమించిన వ్యక్తుల కోసం అవసరమైతే ప్రాణాలకి తెగించి కాపాడుతాయి. ఏ జంతువైనా సరే దాన్ని మచ్చిక చేసుకుంటే... మచ్చా నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదురా అనేలా ప్రవర్తిస్తాయి. కష్టమొస్తే కన్నీళ్ళు పెట్టుకోవడమే కాదు, నీళ్లలో కొట్టుకుపోయే పరిస్థితి వస్తే.. నేనున్నా మచ్చా అని ముందుకొస్తాయి. పాట్నా పక్కనే ఉన్న రాఘవపూర్ లో ఓ గజరాజు వరదలని సైతం లెక్క చేయకుండా తన మీద ఒక వ్యక్తిని ఎక్కించుకుని మరీ అత్యంత కష్టం మీద ఒడ్డుకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదల కారణంగా మావటి అనే వ్యక్తి, ఒక ఏనుగు గంగానది వద్ద ఇరుక్కుపోయారు. మొత్తానికి ఎలాగోలా సాహసం చేసి ఏనుగు, మావటి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో రాఘవపూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగా నదిని దాటితేనే తాము సేఫ్ గా బయటపెడతామని భావించాడు మావటి. ఏనుగును నది దాటించాలంటే పెద్ద పడవ కావాలి. అంత డబ్బు అతని దగ్గర లేకపోవడంతో ఈదుతూ నదిని దాటాలని మావటి ప్రయత్నించాడు. బలమైన అలల మధ్య ఏనుగు చెవిని పట్టుకుని.. దానిపై కూర్చున్నాడు. ఏనుగు మునిగిపోయేంతగా తల వరకూ అలలు ముంచెత్తుతున్నా 3 కిలోమీటర్లు ఈదుతూ తన ప్రాణాన్ని రక్షించుకుని, మావటి ప్రాణాన్ని కూడా కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత కష్టంలోనూ ఓ మనిషిని ఎక్కించుకుని ఈదుతూ వస్తున్న ఆ ఏనుగును వీడియోను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. జంతువైయుండి మానవత్వాన్ని ప్రదర్శించిన గజరాజుని జై గణేష్ అంటూ పొగుడుతున్నారు. అలలొచ్చినా, అలజడొచ్చినా తగ్గేదెలే అంటున్న ఈ గజరాజుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: NTV Reporter: వరద నీటిలో కొట్టుకుపోయిన NTv రిపోర్టర్! पटना से सटे राघोपुर में गंगा नदी में विशालकाय हाथी के साथ महावत का तैरते हुए विडिओ वायरल हो रहा है। विशालकाय गजराज ने 3 किलोमीटर की दूरी पानी में तैरकर बचाई खुद की और महावत की जान। जय गणेश pic.twitter.com/924zux9BZC — Utkarsh Singh (@utkarshs88) July 13, 2022