యాంకర్ వింధ్యా వినూత్న ఆలోచన : సోనూసూద్‌ ప్రశంసలు!..

క‌రోనా ఆప‌త్కాల స‌మ‌యంలో ఎంతో మందికి సేవ చేసి అండ‌గా నిలుస్తున్నారు న‌టుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ క‌లియుగ క‌ర్ణుడిగా మారారు సోనూ. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు. ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా.. కరోనా రోగులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నాయి. ఈ దశలో మరోసారి ప్రజలకు అండగా నిలిచాడు. కానీ అన్నీ తానై సాయం చేస్తున్న సోనూకు సపోర్ట్ గా నిలవగలిగితే మరింత మందికి ఆయన ఉపయోగ పడతారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎవరికీ లేని క్రేజ్ సోనూకి సొంతమైంది. అలా సాయం చేసేందుకు వచ్చింది మన తెలుగు యాంకర్ వింద్య. దాంతో మీరు నిజమైన రాక్‌స్టార్‌’ అంటూ తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖపై బాలీవుడ్‌ స్టార్‌ సోనూసూద్‌ ప్రశంసలు కురిపించారు.

82733328

ఈ విషయాన్ని యాంకర్‌ వింధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘‘హాయ్‌ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సహాయానికి ‘థాంక్స్‌’ అనే పదం సరిపోదు. సోనూసూద్‌ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన సూపర్‌ రాక్‌స్టార్‌. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి’ అంటూ సోనూ పేర్కొన్నారు. ప్రముఖ తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖ తన వంతు సాయంగా తన కాస్టూమ్స్‌ను వేలం వేసి వచ్చిన నగదు మొత్తాన్ని ఫౌండేషన్‌కు పంపించింది. దీనిపై సోనూసూద్‌ స్పందించారు. ప్రత్యేకంగా వీడియో రూపంలో వింధ్యకు కృతజ్ఞతలు చెప్పారు. వింధ్యావిశాఖ పలు టీవీ షోలతో పాటు ఐపీఎల్‌, ప్రొకబడ్డీ లీగ్‌లకు కూడా ప్రెజంటర్‌గా వ్యవహరిస్తోంది. సోనూసూద్‌ స్వయంగా స్పందించి తనకు బదులివ్వడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేసింది.