గాల్లో ఎగరాల్సిన విమానం.. రొడ్డెక్కి బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది

airplane under bridge

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సమీపంలో గురుగ్రామ్ హైవే పై ఆదివారం ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద విమానం ఇరుక్కు పోయింది. దీంతో స్థానిక ప్రజలు ఇలా ఇరుక్కుపోయిన విమానాన్ని చూసి అంతా షాక్ గురవుతున్నారు. ఇక విషయం ఏంటంటే..? గతంలో ఈ విమానం గాలిలోనే ఎగిరిందని ఇక పాడవటంతో ఎయిర్ ఇండియా విమాన సంస్థ అమ్మివేశారట. దీంతో ఓ భారీ లారీ సాయంతో దీనిని రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్నారు.

అలా వెళ్తున్న సమయంలో ఢిల్లీలోని ఫుట్ పాత్ బిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. దీంతో అటు నుంచి వస్తున్న వాహన దారుల చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక అలా ఇరుక్కుపోవటంతో దానిని బయటకు తీసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారట. దీంతో అటు నుంచి వెళ్తున్న వాహనదారులు అలా ఇరుక్కుపోయిన విమానాన్ని వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంతో వైరల్ గా మారింది. ఇక ఇలాంటి సీన్ గతంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగి వార్తలో నిలిచింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరగటంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇలా ఎరక్కపోయి ఇరుక్కపోయిన విమాన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.