వైరల్‌ వీడియో: పట్టాలపై విమానం.. దూసుకొచ్చిన రైలు..

Flight Incident at train track

నిత్య జీవితంలో ఎన్నో ప్రమాదాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ప్రమాదాల్లో ఇరుక్కుంటుంటాం. యాక్సిడెంట్లు చూడటం సంగతి పక్కన పెడితే.. ప్రమాదానికి గురైతే? ఆ ఊహ కూడా మనం భరించలేం. కానీ, ఓ పైలట్‌ చావును చూసొచ్చాడు. రెండు క్షణాలు ఆగితే.. విగత జీవిగా మారేవాడు. ఆ అధికారులు తమ ప్రణాలకు తెగించి అతడ్ని కాపాడారు.

Flight Incident at train track

వివరాల్లోకి వెళితే.. లాస్‌ ఏంజెల్స్‌ లో రైల్‌ రోడ్‌ ట్రాక్‌ పై ప్రమాదవశాత్తు చిన్న సెప్నా 72 విమానం కూలింది. అందులో ఉన్న పైలట్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, అతడిని బయటకు తీయడం అంత సులువుగా జరగలేదు. మరోవైపు కూత పెడుతూ రైలు దూసుకొస్తోంది. అక్కడి అధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఆఖరి క్షణం వరకు పోరాడి పైలట్‌ ను కాపాడారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.