వృద్ధుడిపై హైనా మెరుపుదాడి.. వీడియో వైరల్‌!

haina attack

అడవులు నరకడం వల్లనో.. జనావాసాలు అడవుల్లోకి వెళ్లడమో.. లేదా అడవుల సాంధ్రత తగ్గడమో, కారణం ఏదానా అడవి జంతువులు అరణ్యం వదిలి గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తున్నాయి. ఆహారం కోసమో, దారితప్పిపోవడం వల్లనో అవి అలా వస్తుంటాయి. ఆ క్రమంలో మనుషులు తారసపడితే అవి దాడి చేయొచ్చు. అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రూర మృగాలు ఆహారం కోసం గ్రామాల్లో మేకలు, గేదెలు వంటి వాటిపై చేసిన దాడులు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. కొన్ని సందర్భాల్లో జరిగిన దాడులు కెమెరా కంటికి చిక్కి తెగ వైరల్‌ అయ్యాయి.

haina attackనాసిక్‌లోని జున్నెర్‌ ప్రాంతంలో ఓ వృద్ధుడిపై హైనా చేసిన దాడి ఇలా కెమెరాకు చిక్కి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ వృద్ధిడు చేతిలో బకెట్‌ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అటుగా చెట్ల పొదల్లోంచి ఓ హైనా ఒక్కసారిగా వచ్చి వృద్ధుడి చేయి పట్టుకుంది. అతనిపై దాడి చేయడం ప్రారంభించింది. పక్కనే ఉన్న ఓ యువకుడు వృద్ధుడి చేతిలోని కర్ర తీసుకుని హైనాని కొట్టడం మొదలు పెట్టాడు. మొదట దెబ్బలు తట్టుకున్న హైనా.. చివరకు తోకముడిచి పరారైంది. కానీ, కొంత సమయం తర్వాత ఆ హైనా మరణించింది. అది దాడి చేసిన సమయానికే గాయపడి ఉందని అటవీ అధికారులు తెలిపారు. హైనాకు సింహం ఎముకలైనా పిండి చేయగల శక్తి ఉంటుంది. ఆ వద్ధుడు అదృష్టవంతుడనే చెప్పాలి. ఒళ్లు గగుర్‌పొడిచే హైనా దాడి దృశ్యాలను మీరూ చూసేయండి.