కారుకు తగిలిన తోపుడుబండి.. నడిరోడ్డుపై మహిళ వీరంగం! వీడియో వైరల్‌

Lady Proffersor Lost her Patience

కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన పొరపాట్లకు కొంతమంది అతిగా రియాక్ట్‌ అవుతారు. డబ్బుతో వచ్చిన అహంకారం కారణంగా అతిగా స్పందిస్తారు. వీరి కోపానికి అమాయక పేదలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి భోపాల్‌లో చోటు చేసుకుంది. తోపుడుబండిపై పండ్లు అమ్ముకునే వ్యక్తిపై ఒక కాలేజ్‌ ప్రొఫెసర్‌ అతి కోపం ప్రదర్శించారు. పొరపాటున తోపుడుబండి ఆమె కారుకు తగలడంతో.. రోడ్డుపైనే వీరంగం సృష్టించింది.

ఆ పేదోడి బండిపై ఉన్న అమ్ముకునే కాయలన్ని రోడ్డుపాలు చేసింది. పేదోడి పొట్టకూటిపై దెబ్బకొట్టింది. ఈ తతంగం అంతా సోషల్‌ మీడియాలో రికార్డ్‌ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆ మహిళా ప్రొఫెసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాన్ని ఇంత అతిగా రియాక్ట్‌ కొంచెం ఓవర్‌గా అనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ మహిళా ప్రొఫెసర్‌ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.