యూట్యూబర్ ప్రాంకు చేస్తున్నాడని తెలీక.. ఓ వ్యక్తి అతడి మూతిపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో యూట్యూబర్ మూతి పగిలిపోయింది. రక్తం బుటబుట కారింది.
ఈ మధ్య కాలంలో ప్రాంకుల హవా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో త్వరగా ఫేమస్ అవ్వాలనుకునే వారు ప్రాంకు వీడియోలు చేయటం మొదలెట్టారు. ప్రాంకు వీడియోల్లో కొన్ని నవ్వు తెప్పిచేవిగా ఉంటే.. మరికొన్ని అసహ్యం కలిగించేవిలా ఉంటున్నాయి. ప్రాంకుల పేరిట కొంతమంది తప్పుతప్పుగా వ్యవహరిస్తున్నారు. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతరులను ఇబ్బంది పెట్టడంతో పాటు.. వారు కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా, ఓ యూట్యూబర్ ప్రాంకు చేసి ముక్కు పగులగొట్టుకున్నాడు. ఏటీఎమ్ చోరీ చేస్తున్నట్లుగా ప్రాంక్ చేసిన అతడిపై జనం దాడి చేశారు. దీంతో ముక్కుపగిలింది.
ఇంతకీ సంగతేంటంటే.. కొన్ని నెలల క్రితం ఓ యూట్యూబర్ ఏటీఎమ్ చోరీ ప్రాంకు చేశాడు. తన మనిషి ఒకడు ఏటీఎమ్‌ల దగ్గర డబ్బులు డ్రా చేస్తున్నట్లు నటిస్తాడు. ఆ సమయంలో యూట్యూబర్ అతడి దగ్గరకు వెళతాడు. అతడి చేతిలో ఉన్న డబ్బును లాక్కోవటానికి ప్రయత్నిస్తాడు. ఇలా చాలా ఏటీఎమ్‌ల దగ్గర ప్రాంకు బాగానే వర్కవుట్ అయింది. అయితే, ఓ చోట మాత్రం బెడిసికొట్టింది. యూట్యూబర్ ఓ ఏటీఎమ్ సెంటర్‌లోకి దూరి తన మనిషిని పట్టుకుని నేలపై పడ్డాడు. డబ్బులు లాక్కోవటానికి ప్రయత్నించసాగాడు.
ఇది గమనించిన అక్కడి వారు యూట్యూబర్‌ను చుట్టుముట్టారు. ఓ వ్యక్తి తన చేత్తో సదరు యూట్యూబర్ మూతిపై బలంగా మూడు దెబ్బలు వేశాడు. అంతే! ముక్కు పగిలి రక్తం బుటబుట కారింది. అప్పుడు యూట్యూబర్ అది ప్రాంక్ అని చెప్పాడు. దీంతో కొట్టిన వ్యక్తితో పాటు మిగిలిన వాళ్లు కూడా పాపం అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన జరిగి నెలలు గడుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.