దేశంలో యువత ఎక్కువగా ఆసక్తి కనబరిచే గేమ్ అనగానే గుుర్తుకు వచ్చేది క్రికెట్. అందుకే ఆదివారంతో పాటు ఏదైనా సెలవులు వస్తే చాలు క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతుంటారు. బ్యాట్, బాల్ తీసుకుని ఖాళీ మైదానాలు, చిన్న చిన్న గల్లీలోనూ ఆడేస్తుంటారు. ఇలా గల్లీలో ఆడి.. ఆ తర్వాత టీమ్ ఇండియాకు సెలక్ట్ అయి సత్తా చాటిన బ్యాట్ మెన్స్ అనేక మంది ఉన్నారు. వారిలోభారత మాజీ కెప్టెన్ ధోనీ ఒకరు. హెలికాఫ్టర్ షాట్స్ కొట్టడంలో ఆయన ప్రసిద్ధుడు. అయితే ఓ బాలిక ఆయన్ను మరిపిస్తోంది.
దేశంలో క్రీడలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేదీ క్రికెట్. ఆ తర్వాతే బ్యాడ్మింటన్, హాకీ, కబడ్డీ వంటి క్రీడలకు ప్రాధాన్యత. పరాయి దేశం నుండి వచ్చిన ఈ స్పోర్ట్‌కు భారత్‍లో మంచి ఆదరణ లభించింది. క్రికెట్‌లో భారత్ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ రేంజ్‌కు చేరింది. క్రీడా రంగాన్ని ఎంచుకోవాలంటే క్రికెట్ వైపే యువత ఎక్కువగా మొగ్గు చూపుతారు. అందుకే సెలవు దొరికిదంటే చాలు.. చాలా మంది యువత ఖాళీ గ్రౌండ్స్ లోనూ, గల్లీలోనూ బ్యాట్లు ఝులిపిస్తారు. ఈ గల్లీ క్రీడల నుండి భారత్ టీమ్‌లో స్థానం సంపాదించి, సత్తా చాటిన క్రికెటర్లు అనేక మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతుంటారు. వారిలో ఒకరు జార్ఖండ్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అతడు క్రీజులో ఉన్నాడంటే..బౌలర్లకు చమటలు పట్టాల్సిందే. ఆయనతో మొదలైంది ఓ ప్రత్యేకమైన షాట్. అదే హెలికాఫ్టర్ షాట్.. నేరుగా వస్తున్న బంతిని గట్టిగా కొట్టి బౌండరీ అవతలా పడేలా చేయడమే ఈ షాట్ ప్రత్యేకత. అయితే ఓ అమ్మాయి అతడిని మరిపిస్తోంది.
బాలిక వస్తున్న ప్రతి బాల్‌ను కూడా మెరుపు వేగంతో కొడుతోంది. ఓ పచ్చని తివాచీపై క్రికెట్ ఆడుతున్న బాలిక పలు షాట్లతో అదరగొడుతుంది. వాటిలో హెలికాఫ్టర్ షాట్ కూడా ఉంది. ఆ బాలిక ఆట తీరు చూస్తే కచ్చితంగా ధోనీ గుర్తుకు రాకుండా ఉండలేరు. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నెట్టింట్లో షేర్ చేశారు. అమ్మాయి బ్యాటింగ్ చేస్తున్నక్లిప్‌ను ట్విట్టర్‌లో పంచుకున్న ఆయన ‘నాకు హెలికాఫ్టర్ షాట్ అంటే చాలా ఇష్టం, మరీ మీకో‘ అంటూ ప్రశ్నను సంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరలయ్యింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 7 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 11 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. బాలిక ఆట తీరు ఆయనను ఎంతో ఆకట్టుకుంది. దీనిపై విపరీతమైన కామెంట్లు కూడా వచ్చాయి. కొంత మంది ఈ బాలిక ప్రతిభను మెచ్చుకుంటే.. మరికొంత మంది ఎవరా అమ్మాయి అని ప్రశ్నించారు.
ఈ క్రికెట్ మేధావి ఎవరు అని ఓ యూజర్ ప్రశ్నించగా.. ఆమె ప్రతి షాట్ చాలా పర్ఫెక్ట్. ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టం… అవును హెలికాఫ్టర్ షాట్ లెజెండ్ ధోనీ గుర్తుకు వస్తున్నాడంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. యువ, ప్రతిభావంతులైన క్రికెటర్ తన కల నిజమైంది, ఆమె హెలికాప్టర్ క్రికెట్ షాట్‌లను ఎలా కొట్టిందో వీడియోను పంచుకున్నందుకు మంత్రికి ధన్యవాదాలు అని మరొకరు అన్నారు. ఎంత అద్భుతమైన ప్రతిభ .. ఆమె షాట్లన్నీ స్పాట్ ఆన్ . ఆమె ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణిస్తుంది మరొకరు రాసుకొచ్చారు. అయితే గతంలో కూడా ఓ బాలికపై ఇదే విధమైన ప్రశంసలు కురపించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. రాజస్థాన్‌లోని బార్మర్‌లో మరో యువతి క్రికెట్ షాట్లు ఆడుతూ సచిన్ టెండూల్కర్ దృష్టిని ఆకర్షించింది. క్లిప్‌లో, అమ్మాయి కొంతమంది అబ్బాయిలతో ఆడుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్టినట్లు కనిపించింది.
My fav is the ‘helicopter shot’☄️
What’s your pick? pic.twitter.com/q33ctr0gnH— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 23, 2023