రెండు కొప్పులు ఒక చోట ఉండకూడదని సామెత. ఇద్దరు ఆడవాళ్లు ఒక్క చోట ఉండే గొడవలు అయ్యాయి,అవుతాయన్న ఉద్దేశంతో ఈ సామెత పుట్టుకొచ్చింది. దాన్ని నిజం చేస్తూ కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. నీళ్ల కుళాయి దగ్గర నుండి..
రెండు కొప్పులు ఒక చోట ఉండకూడదని సామెత. ఇద్దరు ఆడవాళ్లు ఒక్క చోట ఉంటే పొసగక గొడవలు అయ్యాయి,అవుతాయన్న ఉద్దేశంతో ఈ సామెత పుట్టుకొచ్చింది. దాన్ని నిజం చేస్తూ కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. నీళ్ల కుళాయి దగ్గర నుండి.. అనేక విషయాల్లోఆడవాళ్లు కొట్టుకున్న అనేక సంఘటనలు చూశాం. ఇళ్లు, వాకిలి, రోడ్డు అని చూడకుండా పొట్టు పొట్టు తన్నుకుంటారు. ఉన్న పరువును బజారున పడేసుకుంటారు. ఆ సమయంలో ఎవరున్నా అనవసరం. వీరి మధ్యకు వెళ్లిన వాళ్లు కూడా వీరి దాష్టీకానికి బలౌతుంటారు. ఇక ఇరుగింటి, పొరిగింటి సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ఇద్దరు ఆడవాళ్ల మధ్య చిచ్చు రేగిందా.. ఇక అంతే సంగతి.
ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరు ఆడవాళ్లు రోడ్డుపై సిగ పట్టు పట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. సచెండి పోలీస్ స్టేషన్ పరిధిలోని హృద్పూర్ లో కొట్టుకున్న మహిళలు.. ఇరుగు పొరుగున జీవిస్తున్నారు. అయితే ఓ విషయంపై వీరిద్దరి మధ్య తగాదా మొదలైంది. మాటలు మాటలు పెరిగి చేతల వరకు వచ్చాయి. ఇక రోడ్డు మీద ముష్టి యుద్ధం స్టార్ చేసేశారు. ఒంటిపై దుస్తులు ఊడిపోతున్న పట్టించుకోకుండా.. జుట్లు పట్టుకుని రోడ్డుపై పడిపోయి మరీ దాడి చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు ఓ పురుషుడు ప్రయత్నించినప్పటికీ.. మళ్లీ కొట్టుకున్నారు. మరికొంత మంది మహిళలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు.
— krishna veni (@krishna66577649) June 30, 2023