ఈ ప్రపంచంలో ప్రేమ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. పుట్టిన ప్రతీవారు ఏదో ఒక సమయంలో ప్రేమను అనుభవించే తీరాలి. అయితే, ఆ ప్రేమ వ్యవహారం తీపిని మిగల్చవచ్చు.. ఛేదును మిగల్చవచ్చు. ముఖ్యంగా ఈ తరంలో సక్సెస్ సాధించే ప్రేమల కంటే.. విఫలమయ్యే ప్రేమలే ఎక్కువ. అదికూడా సంవత్సరం లోపు బ్రేకప్ అయ్యే ప్రేమ కథలే ఎక్కువ. బ్రేకప్ చెప్పే వారు ఒకరైతే.. బాధపడే వారు ఇంకొకరు. అవతలి వ్యక్తితో ప్రేమ బోర్ కొట్టగానే బ్రేకప్ చెప్పేస్తారు. దీంతో బ్రేకప్‌కు గురైన వ్యక్తి బాధలో కుమిలికుమిలి ఏడుస్తుంటారు.
తాజాగా, ఓ యువతి తన ప్రియుడి చేతిలో బ్రేకప్‌కు గురైంది. ఆ బాధలో వెక్కివెక్కి ఏడ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వంశిక, ఆకాష్‌లు గత మూడు నెలలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ప్రేమలో మునిగి తేలుతున్నారు. అతడు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు వంశిక ఎంతో సంతోషించేది. ఈ నేపథ్యంలోనే తమ ప్రేమ మూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని సెలెబ్రేట్ చేద్దామని భావించింది. ఇంతలోనే ప్రియుడి దగ్గరినుంచి ఫోన్ వచ్చింది.
ప్రేమలో చిన్న బ్రేక్ తీసుకుందాం అంటూ అతడు బ్రేకప్ చెప్పాడు. దీంతో ఆమె మనసు ముక్కలైంది. బ్రేకప్ బాధను తన స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పుకుంది. ఆ స్నేహితురాలు దాన్నంతా వీడియో తీసింది. ఆ వీడియోలో వంశిక ఏడుస్తూ తన బాధను ఆమెతో చెప్పుకుంది. ప్రియుడు బ్రేకప్ చెప్పటం వల్ల తాను పడుతున్న బాధను వివరించింది. తర్వాత ఆమె ఫ్రెండ్ ఓ వ్యక్తి గురించి చెప్పింది. అతడు వంశిక గురించి ఆరా తీస్తున్నాడని కూడా అంది. దీంతో వంశిక ‘‘ అతడు ఎలా ఉంటాడు.. బాగుంటాడా?’’ అని అడిగింది. బాగుంటాడని.. ఇద్దరూ డేట్‌కు వెళితే హీల్స్ వేసుకువెళ్లమని ఫ్రెండ్ సలహా ఇచ్చింది.
probably the funniest post-breakup crying session 😭😭 pic.twitter.com/tkac4bbgxs
— isHaHaHa (@hajarkagalwa) December 8, 2022