మనం ప్రకృతిలో ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం. వెరైటీగా ఉండే చెట్లు, రకరకాల పక్షులు అప్పుడప్పుడు కనిపిస్తూ వారెవ్వా అనిపిస్తాయి. చెట్టు నుంచి నీరు కారడం మాములే.. కానీ మోటర్ వేస్తే పైప్ లో నుంచి వచ్చినట్లు.. ధారళంగా రావడం ఎక్కడ చూసి ఉండము. ‘భైరవ ద్వీపం’ సినిమాలో హీరో బాలకృష్ణ అడవుల్లోకి వెళ్లి నీరు ఉన్న చెట్టును కనిపెడతాడు. సినిమాలోనే కాకా నిజ జీవితంలో కూడా అచ్చం అలానే ఓ చెట్టు నుంచి నీళ్లు వస్తున్నాయి. మరి ఆ అద్భుతమైన చెట్టు యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ చెట్టు పేరు క్రొకడైల్ బార్క్ ట్రీ.. అంటే మొసలి తోలు చెట్టు. దీని శాస్త్రీయ నామము టైర్మినలియా ఎల్లిప్టికా. ఈ చెట్టు ఎండాకాలంలో నీటిని దాచి ఉంచి అందరిని అబ్బురపరుస్తుంది. ఈ చెట్టును కట్ చేస్తే నిరంతరంగా నీరు వస్తుంది. 30 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్లు పొడి, తేమతో కూడిన అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి. వాటి కాండం నీటితో నిండి ఉంటుంది. కట్ చేసిన వెంటనే ఫోర్స్‌తో అందులోంచి నీళ్లు వస్తుంటాయి. దీనికి సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ ఆఫీసర్ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ చెట్ల నుంచి నీళ్లు వచ్చిన నీళ్లను అక్కడి వారు తాగుతారు.
ఈ నీళ్లు తాగడం వల్ల పొట్టలో సమస్యలు తొలగిపోతాయని అక్కడి వారు అంటున్నారు. అంతేకాదు.. ఈ చెట్టు అగ్ని ప్రమాదం, ఎండల తీవ్రత నుంచి అడ్డుకోగలదు. అంటే ఈ చెట్టుకి మంటలు అంటవు. అందువల్ల ఎండాకాలంలో అడవుల్లో తిరిగే అధికారులకు ఈ చెట్లు తాగునీరు ఇస్తున్నాయి. అయితే ఈ చెట్టుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాగు నీరు అందిస్తున్న ఈ చెట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.