Viral Video: బాయ్స్ సినిమా చూసిన వాళ్లకు హీరో సిద్ధార్ధ్ హీరోయిన్ను ఇంప్రెస్ చేయటానికి సైకిల్‌పై ఫీట్లు చేసే సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్లో హీరో సైకిల్‌పై హీరోయిన్ ముందు అటు ఇటు చక్కర్లు కొడతాడు. కొద్దిసేపటి తర్వాత సైకిల్ టైర్ స్కిడ్ అయి రోడ్డుపై బొక్క బోర్లా పడతాడు. ఎవరినైతే ఇంప్రెస్ చేయాలనుకుంటాడో ఆమె కాళ్ల దగ్గరే పడతాడు. అచ్చం ఇలాంటి సీనే కాకపోయినా.. యువతుల ముందు ఫోజులకు పోయి పరువు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. అమ్మాయిల ముందు ఫ్రెండ్ బైకుపై స్టంట్లు చేయటానికి ప్రయత్నించి కింద జారిపడ్డాడు. దీంతో బ్యాక్ బద్దలైంది. చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని కారైకుడికి చెందిన ఓ యువకుడు బస్సు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిల్ని ఇంప్రెస్ చేద్దామనుకున్నాడు.
ఇందుకోసం ఫ్రెండ్ బైక్ ఎక్కాడు. ఫ్రెండ్ ఆ బైకును నడుపుతుండగా లవర్ బాయ్ వెనకాల కూర్చున్నాడు. ఆ ఫ్రైండ్ రోడ్డుపై వేగంగా బైక్ నడుపుతున్నాడు. బైకు అమ్మాయిల దగ్గరకు వస్తుండగా వెనకాల కూర్చున్న లవర్ బాయ్ పైకి లేచాడు. ఏవో స్టంట్లు చేద్దామని చూశాడు. కానీ, కాళ్లు జారాయి. పట్టు తప్పి కింద రోడ్డుపై పడ్డాడు. ఆ పడ్డ పడ్డం బ్యాక్ బలంగా నేలను తాకింది. కుర్రో అని అరిచాడు. ఎవరి ముందు అయితే ఫోజులు కొడదామని అనుకున్నాడో.. వారి ముందే నవ్వుల పాలయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పోలీసులు స్టంట్లు చేసిన వారిపై సీరియస్ అయ్యారు. ఆ ఇద్దరితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.