సాధారణంగా రోడ్డు ప్రమాదం అనగానే.. ఎవరైనా భయపడతారు. కొన్నిసార్లు ఆ దృశ్యాలను కూడా చూసేందుకు ఇష్టపడరు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని ప్రమాదాలు ఆశ్చర్యపరుస్తాయి. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అని పదే పదే ఆ విజువల్స్ చూసేలా చేస్తాయి. అలాంటి ఒక ప్రమాదం గురించి ఇప్పుడు చూద్దాం.
రోడ్డు ప్రమాదాలు అంటే అందరికీ పరిచయం ఉండే ఉంటుంది. కొందరు లైఫ్ లో చూసుంటారు, కొందరు సోషల్ మీడియాలో చూసుంటారు, ఇంకొందరు స్వయంగా బాధితులు కూడా అయి ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో వాహనాలు నుజ్జు నుజ్జు అయిపోవడం, అందులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు పోవడం, శాశ్వతంగా అంగవైకల్యానికి గురైన వాళ్లు కూడా ఉండే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా.. అందులో ఉండే వారికి చిన్న దెబ్బ కూడా తగలదు. అలాంటి ఒక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ షాకింగ్ ప్రమాదం అమెరికాలో జరిగింది. హైవేలో వాహనాలు అన్నీ వెళ్తున్నాయి. ఒక వ్యక్తి తన కారులో నుంచి తన ప్రయాణాన్ని వీడియో తీస్తూ ఉన్నాడు. అతను రికార్డ్ చేయకపోతే ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురించి ఎవరికి చెప్పిన నమ్మే వాళ్లు కాదేమో? ఎందుకంటే హైవే మీద వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఒక లైన్ లో ఒక మ్యాక్సీ ట్రక్, దాని వెనకాల ఒక కంటైనర్ వెళ్తోంది. రెండో లైన్ లో వీడియో తీస్తున్న వ్యక్తి కారు ఉంది. మూడో లైన్ లో ఒక బ్లాక్ కలర్ కారు వేగంగా వెళ్తోంది. అయితే వీడియో తీస్తున్న వ్యక్తి కారును క్రాస్ చేసి కాస్త ముందుకు వెళ్లగానే మ్యాక్సీ ట్రక్ టైర్ ఊడిపోయి ఈ నల్ల కారు కిందకు వెళ్లింది.
రన్నింగ్ లో ఒక్కసారిగా టైర్ కారు కిందకు రావడంతో నల్లకారు అమాంతం గాల్లోకి లేచి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఆ టైరు వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి కారైపు వస్తుండగా అతని కారు ఆటో పైలట్ గమనించి పక్కకు తప్పుకుంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే.. ఆ కియా కారు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. అతను లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడంట. ఈ వీడియో అతను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Witnessed and recorded the most INSANE car crash yesterday, you can see Autopilot also swerve and avoid the rouge tire for me $TSLA pic.twitter.com/csMh2nbRNX
— Anoop (@Anoop_Khatra) March 25, 2023