Viral Video: పిల్ల ఎలుగు బంటి ప్రాణాల్ని కాపాడ్డానికి ఓ తల్లి ఎలుగు బంటి తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. పిల్లపై దాడి చేయటానికి వస్తున్న మగ ఎలుగు బంటిపై తిరగబడింది. దాని దాడిలో తీవ్రంగా గాయపడింది. అయినా వదల్లేదు.. తర్వాత ఏం జరిగింది?.. తల్లి ఎలుగు బంటి బలమైన మగ ఎలుగు బంటితో పోరులో గెలిచిందా?.. తన పిల్లను కాపాడుకోగలిగిందా?.. లేక ఓటమిపాలై పిల్లను కోల్పోయిందా?.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. స్పేయిన్‌లోని పెలెన్సియా, మోన్‌టానా పాలెంటినా నాచురల్ పార్కులోని పెనాడే శాంతా లూసియా కొండపై ఓ తల్లి ఎలుగు బంటి తన పిల్ల ఎలుగు బంటితో కూర్చుని ఉంది.
కొద్ది సేపటి తర్వాత ఓ బలమైన మగ ఎలుగు బంటి అక్కడికి వచ్చింది. అది నేరుగా తల్లి, పిల్ల ఎలుగు బంట్లు ఉన్న చోటుకి వచ్చింది. పిల్ల ఎలుగు బంటిపై దాడి చేయటానికి ప్రయత్నించింది. అయితే, తల్లి ఎలుగు బంటి వెంటనే దాన్ని ప్రతి ఘటించింది. బిడ్డకు అండగా నిలిచింది. దీంతో మగ ఎలుగు బంటి తల్లి ఎలుగు బంటిపై దాడి చేయటం మొదలుపెట్టింది. కొండ అంచుపై రెండూ గొడవపడుతున్నాయి. ఏం జరుగుతోందో అర్థం కాని పిల్ల ఎలుగు బంటి వాటిని చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత అదుపు తప్పి రెండు ఎలుగు బంట్లు కిందపడ్డాయి.
మగ ఎలుగు బంటి నేరుగా కిందపడగా.. తల్లి ఎలుగు బంటి పల్టీలు కొడుతూ కింద దూరంగా వచ్చి పడింది. అయితే, తల నేలకు బలంగా తగలటంతో మగ ఎలుగు బంటి అక్కడికక్కడే చనిపోయింది. తల్లి ఎలుగు బంటి దేవుడే వచ్చి కాపాడినట్లు బతికిపోయింది. కొంత సేపటి తర్వాత బిడ్డను చేరుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఏ రూపంలో ఉన్నా.. తల్లి ప్రేమను మించింది లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Video: సైకిల్ తొక్కుతూ కిందపడిన గొరిల్లా.. కోపంతో ఏంచేసిందంటే!