అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. అయితే కొందరికి అదృష్టం వరించినా దాని అందుకునే అవకాశం ఉండదు. “దేవుడు చేసిన మనషులు” సినిమాలో ఆలీకి అదృష్టం కాళ్ల ముందుకు వచ్చినా.. చేతిలోకి తీసుకోలేదు. అట్లానే తాజాగా అమెరికా కు చెందిన వ్యక్తికి లాటరీలో మన కరెన్సీలో రూ.10,136 కోట్లు గెలుచుకున్నాడు. కానీ అతనెవరనేది తెలియకపోవడం కొసమెరుపు. ఇప్పుడు ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలో మెగా మిలియన్స్ అనే సంస్థ నిర్వహించిన లాటరీలో ఓ వ్యక్తి రెండు డాలర్లు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతకాలానికి లాటరీ గెలిచిన టికెట్ల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఆ వివరాల్లో సదరు వ్యక్తికి ఏకంగా 1.28 బిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో 10,136 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ టికెట్ అమ్ముడైనట్టు మెగా మిలియన్స్ సంస్ధ తెలిపింది. అయితే, ఆ వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని తెలిపిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2015 నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ తీసిన 29 డ్రాలలో ఇప్పటి వరకూ ఒక్కరు కూడా జాక్‌పాట్ కొట్టిన దాఖలాలు లేవు.
తాజాగా ఓ వ్యక్తికి ఆ జాక్ పాట్ కొట్టాడు. అమెరికా చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద జాక్‌పాట్ అట. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎక్కడున్నాడో ఆ అదృష్టవంతుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అదృష్టమేదో మాకు తగిలి ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.