శక్తిమాన్ ప్రోగ్రామ్ లో నటుడు ముఖేశ్ ఖన్నా సూపర్ హీరో పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ముఖేశ్ ఖన్నా తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం కాస్త వైరల్ గా మారుతున్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడంతో కొందరు ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే? ముఖేశ్ ఖన్నా భీష్మ్ అనే యూట్యూబ్ ఛానెల్ ను నడిపిస్తున్నాడు. ఇందులో పలు అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ వీడియోలు రూపొందిస్తుంటాడు. అయితే తాజాగా తన ఛానెల్ ద్వారా ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరైన అమ్మాయి తనకు శృంగారం కావాలని అబ్బాయిని అడిగితే.., అప్పుడు ఆమె అమ్మాయి అవ్వదు, సెక్స్ వర్కర్ అవుతుందంటూ కామెంట్స్ చేశాడు. నేటి కాలంలోని అమ్మాయిలు డబ్బుల కోసం ఇంటర్నెట్ లో తెగ కనిపిస్తుంటారని, అలాంటి వారి పట్ల పురుషులు జాగ్రత్తగా ఉండాలనే విధంగా కామెంట్స్ చేశాడీ శక్తిమాన్. ఇంకొందరు అమ్మాయిలు అబ్బాయిలనే టార్గెట్ గా చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంటారని, యువకులు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు. ఆయన చేసిన ఈ విధమైన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖేశ్ ఖన్నా తాజా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Bollywoodshitposts (@bollywoodshitposts) ఇది కూడా చదవండి: Shilpa Shetty: డైరెక్టర్ చెప్పాడని కాలు విరగొట్టుకున్న హీరోయిన్ శిల్పా శెట్టి!