పెళ్లి.. ఈ పవిత్రమైన కార్యాన్ని ప్రతీ ఒక్కరూ అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని ముందుగానే ఎన్నో ప్లాన్ లు వేసుకుంటుంటారు. ఇక మారిన కాలానికి అనుగుణంగా ఒకరిని మించి మరొకరు ప్రీ వెడ్డింగ్ షూట్, ఫొటో షూట్ లు అంటూ లక్షలు ఖర్చు చేసి విభిన్నమైన రీతిలో వివాహాన్ని జరుపుకుంటూ బంధువులు చర్చించుకునేలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. పెళ్లి మండపంలో అందరూ చూస్తుండగానే ఆ వధువు పెళ్లి పీటలపై షాకింగ్ నిర్ణయం తీసుకుని తన సేవాదృక్పథాన్ని చాటుకుంది. ఆ వధువు చేసిన పనికి కొందరు ఆశ్చర్యపోయి నోళ్లు తెరవగా.. మరికొందరు శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. అసలు పెళ్లి పీటలపై ఆ యువతి ఏం నిర్ణయం తీసుకుంది? అంత గొప్పగా ఆమె చేసిన పనేంటనేది తెలుసుకోవాలనుందా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎంతో పవిత్రంగా భావించే పెళ్లిని ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటున్నారు. పెళ్లి వేడుకకు హాజరయ్యే బంధువులకు పసందైన వంటకాలు పెడుతూ అందరూ మెచ్చుకునేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వధువు మాత్రం అందరిలా కాకుండా కాస్త సేవ గుణంతో ఆలోచించి పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. విషయం ఏంటంటే? ఓ చోట పెళ్లి వేడుక జరుగుతుంది. వధువు, వరుడుతో పాటు బంధువులు అంతా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆ వధువు క్యాన్సర్ బాధితులకు తన తన జుట్టును డొనేట్ చేయాలనుకుంది. ఇక ఇందులో భాగంగానే వధువు అదే పెళ్లి బట్టలపై అందరూ చూస్తుండగానే తన అందమైన జుట్టును కట్ చేసి క్యాన్సర్ రోగులకు డొనేట్ చేసింది.
ఈ సీన్ చూసిన పెళ్లికి వచ్చిన బంధువులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక మరికొందరు మాత్రం ఆ యువతి చేసిన పనిని మెచ్చుకుని ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి కూతురు జుట్టును కత్తిరించుకుంటుండగా కొందరు వీడియోలు తీశారు. అదే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది నెజన్స్ ఆ యువతి సేవాదృక్పథాన్ని మెచ్చుకుని శభాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియదు. పెళ్లి పీటలపై తన అందమైన జుట్టును క్యాన్సర్ రోగులకు డొనెట్ చేసిన ఈ యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 6, 2023