ఈ ప్రకృతి ఎంతో అందమైనది. ఇందులో మనకు తెలియని వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. భూమిపై ఎన్నో సహజ అద్భుతాలు మనకు కనువిందు చేస్తాయి. అందులో ఒకటి రెయిన్ బో యూకలిఫ్టస్. ఎవరైనా పెయింట్ చల్లారా, ఇంద్రధనస్సు తన ఏడు రంగులను వెదజలిందా అని ఈ చెట్టును చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. ఈ చెట్టుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే.. చెట్టు కాండంపై రకరకాల రంగులు కనిపిస్తాయి. ఎవరో చెట్టుపై రంగుల్ని వెదజల్లినట్లుగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో దీనిని రెయిన్‌బో గమ్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ చెట్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కనిపిస్తాయి. వర్షారణ్యాలలో కనిపించే యూకలిప్టస్ జాతి ఇదొక్కటేనని చెబుతారు. One Earth అనే సంస్థ నివేదిక ప్రకారం.. రెయిన్‌బో యూకలిఫ్టస్ వయసు పెరిగే కొద్దీ.. దాని రంగులు కూడా మారుతాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవు. చెట్టు పెరిగేకొద్దీ.. దాని బెరడు బయటకు వస్తుంది.
అప్పుడు కాండంపై ఉన్న రంగులు బయటపడతాయి. ఆ రంగుల్లో రెయిన్‌బో యూకలిఫ్టస్ చెట్టు ఇంకా అందంగా కనిపిస్తుంది. సూర్యకాంతిలో మరింతగా మెరిసిపోతుంది. IFS అధికారి సుశాంత్ నందా రెయిన్‌బో యూకలిప్టస్ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రంగులు మార్చే ఈ చెట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.