‘నెట్‌ఫ్లిక్స్’ మోస్ట్ సక్సెఫుల్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. పేరుకు స్పానిష్ వెబ్‌సిరీస్ అయినా ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉన్న వెబ్‌సిరీస్. ఇండియాలోనూ ఈ వెబ్‌సిరీస్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు. ఎంతో తెలివైన వ్యక్తి ప్రొఫెసర్‌గా ప్రేక్షకులకు సుపరిచితుడు. బ్యాంకులను కొల్లగొట్టే కథాంశంతో సక్సెస్‌ఫుల్‌గా నాలుగు పార్టులు పూర్తి చేసుకున్న మనీ హెయిస్ట్ ఐదో సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సీజన్-5 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సీజన్- 5 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో పార్ట్-5, వాల్యూమ్ 1ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళ్, హిందీలో ఈ సీజన్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే ‘జల్దీ ఆవో’ అంటూ ఓ ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ‘త్వరగా రావచ్చు కదా’ అంటూ వీడియో మొత్తం సాగుతుంది.
ఈ వీడియోలో రానా, శ్రుతిహాసన్, హార్దిక్ పాండ్యా, అనిల్ కపూర్, రాధికా ఆప్టే, వెబ్ సిరీస్‌కు సంగీతం అందించిన న్యూక్లెయా ఉన్నారు. మొత్తం వీడియో అంతా ప్రత్యేకంగా భారతీయ అభిమానుల కోసం చిత్రీకరించిందిగా ఉంది. ఈ సీజన్‌తో వెబ్‌సిరీస్ ముగుస్తుందని కూడా టాక్ ఉంది. ప్రతిసారి ఎస్కేప్ ప్లాన్‌ను రెడీగా ఉంచుకునే ప్రొఫెసర్, ఈసారి ఏ ప్లాన్‌లేక ఇరుక్కుపోవడంతో… ఇదే ఆఖరి సీజన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఆ ప్రమోషనల్ వీడియోని మీరూ చూసేయండి.