దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలుసు. ఈ సినిమా గత ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం రికార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ వంటి అవార్డులు వరించాయి. ఈ అవార్డులు రావడంతో యావత్ భారత దేశం ఎంతో గర్వంగా ఫీలవుతుంది. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
నాటు నాటు సాంగ్ కు ప్రతి ఒక్కరూ కాలు కదిపిన వారే. అందులో సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. కానీ హీరో అత్తయ్య కాలు కదపడం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదూ అపోలో హాస్పటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ శోభన కామినేని. దావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాకు అవార్డులు వరించడంపై హీరో రామ్ చరణ్ అత్తయ్య శోభన కామినేని ఆనందం వ్యక్తం చేశారు.
ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లినా తన అల్లడు గురించే అడుగుతున్నారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ ఎంతో మంది భారతీయులకు ఆశలు కల్పించిందని అన్నారు. ఈ సినిమా పట్ల ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియిలు చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ సమయంలో విలేకరితో కలిసి ఆమె నాటు నాటు పాటకు కాలు కదిపారు. ఈ వీడియోను విలేకరి షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై శోభన కుమార్తె, రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు. అల్లుడి ఘనతను ఆనందంతో గర్విస్తోన్న అత్తయ్య, లవ్ యూ అమ్మ అంటూ రాసుకొచ్చారు.
Very proud mother in law – #NatuNatu in Davos ❤️🤩
Love mom @shobanakamineni https://t.co/yBc6CI4f79— Upasana Konidela (@upasanakonidela) January 18, 2023