కానిస్టేబుల్.. బస్ కండెక్టర్‌పై దారుణంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండా బాగా కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చేతిలో అధికారం ఉంది కదా అని కొంతమంది పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. జనాలకు రక్షణగా ఉండాల్సింది పోయి.. వారిపైనే దాడులకు తెగబడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు పోలీసులు ప్రజలపై దాడులు చేసిన సంఘటనలు దేశ వ్యాప్తంగా చాలా జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్.. టిక్కెట్ అడిగినందుకు బస్ కండెక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగా బస్సులో దారుణంగా చితకబాదాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఈటా జిల్లాకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కొద్దిరోజుల క్రితం ఓ బస్ ఎక్కాడు. ఆ బస్ కండెక్టర్ అందరినీ టిక్కెట్ తీసుకోమని అడిగినట్లే ఆ కానిస్టేబుల్‌ను కూడా టిక్కెట్ తీసుకోమని అడిగాడు.
అయితే, ఆ కానిస్టేబుల్‌కు కోపం వచ్చింది. నన్నే టిక్కెట్ తీసుకోమంటావా అంటూ కానిస్టేబుల్‌తో గొడవపెట్టుకున్నాడు. గొడవ చినికి చినికి గాలివానగా మారింది. దీంతో కానిస్టేబుల్ కోపం కట్టలు తెంచుకుంది. కండెక్టర్‌పైకి విరుచుకుపడ్డాడు. బస్సులో అందరూ చూస్తుండగా కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విషయం కాస్తా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. అధికారులు సదరు కానిస్టేబుల్‌పై విచారణకు ఆదేశించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.