సోషల్ మీడియా వచ్చాక చాలా మంది సెలబ్రిటీలు పుట్టుకొచ్చారు. టిక్ టాక్‌ల ద్వారా ఎంతో మంది స్టార్లు కూడా అయ్యారు. డబ్ స్మాష్, టిక్ టాక్ వంటివి బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటివి బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు మోజ్, రొపోసో, జోష్ అనే యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మోజ్ ద్వారా కూడా చాలా మందికి గుర్తింపు లభించింది. వాళ్లు కూడా ఇప్పుడు సెలబ్రిటీలుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఎంత సెలబ్రిటీ హోదా వచ్చినా కూడా తలపొగరు అనేది ప్రదర్శించకూడదు. అలా చేస్తే వచ్చిన సెలబ్రిటీ హోదా నిలబడదు. పైగా కొత్త సమస్యల్లో కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది.
ఏదో వైరల్ వీడియో కోసం ప్లాన్ చేసింది. కానీ, నెట్టింట ఆ ప్లాన్ కాస్తా రివర్స్ అయ్యి ఇప్పుడు పోలీసులు కేసు పెట్టేదాకా వెళ్లింది. విషయం ఏంటంటే.. మోజ్ బేస్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ కాజల్ కష్టాల్లో చిక్కుకుంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఆమె ఎక్కడో రోడ్డు మీద ఓ కుక్కను దగ్గరకు తీసుకుంటూ కనిపించింది. ముందు దానిని ప్రేమగా పిలుస్తూ దగ్గరి వరకూ రాన్నించ్చింది. అది తోక ఊపుకుంటూ దగ్గరకు వెళ్లగా.. దానిని బూతులు తిడుతూ కాలితో తన్నింది. ఇది కేవలం వీడియో వైరల్ అవ్వడం కోసం ఆమె అంత ప్రేమగా నటించి.. చివరికి కుక్కను కాలితో తన్నింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
How can you be so insensitive toward these voiceless souls
If you cant love them dont hurt them #AnimalAbuse#DogsOnTwitter pic.twitter.com/8HaC2zD7Ea
— Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) November 30, 2022
అయితే ఈ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరులేని మూగజీవాన్ని అంతలా తంతావా అంటూ కాజల్‌పై పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ కుక్కను అంత దారుణంగా తంతూ.. బూతులు తిడతావా అంటూ కోపగించుకుంటున్నారు. కొందరైతే ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ట్విట్టర్ వేదికగా ఆమె వీడియో పోస్ట్ చేస్తు.. పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. నోయిడా పోలీసులు ఆమెను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాజల్ అనే యువతికి మోజ్లో 2.2 మిలయన్ ఫాలోవర్లు ఉన్నారు. అటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 1.2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న ఒక కంటెట్ క్రియేటర్ ఇంత దారుణంగా ప్రవర్తించడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
How can you be so insensitive toward these voiceless souls
If you cant love them dont hurt them #AnimalAbuse#DogsOnTwitter pic.twitter.com/8HaC2zD7Ea
— Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) November 30, 2022