Rag Doll: మనిషి తన జీవితంలో దేన్నైనా భరించగలడు కానీ, ఒంటరి తనాన్ని మాత్రం కాదు. ఎక్కువ రోజులు ఒంటరిగా గడిపితే.. మానసిక రుగ్మతలు తలెత్తతాయి. కొంతమంది ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్లోకి కూడా పోతుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం ఒంటరితనాన్ని తప్పించుకోవటానికి ఓ బట్ట బొమ్మతో స్నేహం చేశాడు. ఆ బొమ్మతో ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మోంట్బీకే5959 అనే టిక్‌టాక్ ఖాతాదారుడు ఒంటిరి తనాన్ని భరించలేక నటాలియా అనే బట్ట బొమ్మతో స్నేహం చేశాడు.
ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఓ సంవత్సరం పాటు ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లికి సిద్దమయ్యాడు. త్వరలో గ్రాండ్‌గా నటాలియాను పెళ్లి చేసుకోవటానికి ప్లాన్ చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ ప్రేమలో సంవత్సరం పూర్తి చేసుకున్న వేడుకల్ని జరుపుకున్నారు. బొమ్మతో పెళ్లిపై సదరు టిక్‌టాక్ ఖాతాదారుడు మాట్లాడుతూ.. ‘‘ నేను నా నటాలియాతో కలిసి టీవీ చూస్తాను. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. జనాలకు తెలియదు. నేను ఆమెను ఎంత ప్రేమిస్తున్నానో.
త్వరలో నటాలియాను పెళ్లి చేసుకోబోతున్నాను’’ అని పేర్కొన్నాడు. అతడి దగ్గర నటాలియానే కాదు.. బట్టతో తయారు చేసిన పిల్లల బొమ్మలు కూడా ఉన్నాయి. తన టిక్‌టాక్ ఫాలోవర్స్‌కు బట్ట బొమ్మ పిల్లల్ని తమ బిడ్డలుగా పరిచయం చేశాడు. ఇద్దరూ కలిసి పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారంట. పిల్లల హోం వర్క్ చేయించటంలోనూ.. స్కూలుకు తయారు చేయటంలోనూ ఎంతో శ్రద్ధ చూపిస్తామని సదరు వ్యక్తి తెలిపాడు. మరి, బట్ట బొమ్మతో యువకుడి పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Harsha Sai: 2 సెకన్లు షూ పాలిష్ చేసినందుకు రూ.20 వేలు ఇచ్చిన హర్షా సాయి!