హర్షా సాయి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ పేరు ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. 2018 ఆగస్టులో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన హర్షా సాయి చాలా తక్కువ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం నాలుగేళ్లలోనే 6.65 కోట్ల సబ్‌స్క్రైబర్స్, 58.95 కోట్లకు పైగా వ్యూస్ సంపాదించాడు. ఓ కాన్సెప్ట్ తో ఓవర్ నైట్ దేశవ్యాప్తంగా హర్షా సాయి పేరు వైరల్ అయ్యింది. అయితే అతనికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అని అంతా అనుకోవచ్చు. ఎందుకంటే అతను చేసే ప్రతి వీడియో పేదలకు, మధ్యతరగతి వాళ్లకు చేతమైనంత సహాయం చేస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వాళ్ల కలలు నెరవేరుస్తూ ఉంటాడు. ఆ మొత్తం కాన్సెప్ట్ ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వీడియోలకు వచ్చే రెవెన్యూతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Harsha sai (@harshasai_) ఫ్రీ పెట్రోల్ బంక్ అనే కాన్సెప్ట్ తో హర్షా సాయి పేరు ఓవర్‌నైట్‌లో వైరల్ అయిపోయింది. ఇటీవలే పేదలకు ఫ్రీ ఫైస్టార్ హోటల్ అంటూ చేసిన వీడియో కూడా ఎంతో వైరల్ అయ్యింది. అతని ఛానల్‌లోని ప్రతి వీడియోకి మిలియన్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి. పైగా హర్షాసాయికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. View this post on Instagram A post shared by Harsha sai (@harshasai_) తాజాగా హర్షా సాయి ఓ చెప్పులుకుట్టే వ్యక్తి సాయం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారులో వెళ్తూ ఎండలో గొడుగు పెట్టుకుని చెప్పులు కుడుతున్న వ్యక్తిని హర్షా సాయి చూస్తాడు. అతనికి ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకుని.. తన షూ పాలిష్ చేయాలంటూ కోరుతాడు. కాస్త దుమ్ము ఉండగా అతను క్లీన్ చేసి ఇస్తాడు. View this post on Instagram A post shared by Harsha sai (@harshasai_) ఎంత ఇవ్వమంటావ్ అని అడగ్గా చిన్న పనేగా డబ్బు వద్దులే అంటాడు. ఆ తర్వాత హర్షా సాయి రూ.20 వేలు ఇవ్వగా అది చూసి ఆశ్చర్యపోతాడు. మొదట హర్షాసాయిని సినిమా హీరో అనుకుని ఇదేదో ప్రాంక్ అనుకున్నాడు. కానీ అలా డబ్బు ఇవ్వగానే అతను చాలా భావోద్వేగానికి గురయ్యాడు. వైరల్ అవుతున్న హర్షా సాయి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Harsha sai (@harshasai_) ఇదీ చదవండి: వీడియో: పిల్లలి ఆకలి తీర్చేందుకు ఓ తండ్రి కష్టం! ఇదీ చదవండి: వైరల్ వీడియో: ఉట్టి కొట్టి, ప్రాణాలు విడిచాడు!