అతిగా ప్రవర్తించడం అనేది ఎప్పుడైన అనర్ధానికి దారితీస్తుంది. కొన్ని సార్లు ప్రాణాల మీదకి కూడా తెస్తుంది. ముఖ్యంగా కొందరు తమకు ప్రావీణ్యం ఉన్న విషయంలో అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు అలా అతిగా ప్రవర్తించి ప్రాణా మీదకి తెచ్చుకున్నాడు. విషం ఉందని తెలిసి కూడా నాగుపాముకు ముద్దు పెట్టబోయాడు. ఆ పాము అదే రేంజ్ లో తిప్పి కొట్టి.. పెదాలపై కాటు వేసింది. నాగుపాముపై ప్రేమ చూపించాలనుకుంటే.. ఆ పామునే అతడి రివర్స్ లో తన ప్రేమను చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక లోని శివమొగ్గం జిల్లా భద్రావతి బొమ్మనకట్టే ప్రాంతంలో నాగుపాము కనిపించింది. దీంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. పాముల్ని పట్టే వ్యక్తిని పిలిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి పామును చాకచక్యంగా పట్టేసుకున్నాడు. ఇదే సమయంలో అందరూ వీడియో తీసున్నారనే అత్యుత్సాహంతో అతగాడు అతిగా ప్రవర్తించాడు. నరసింహా సినిమాలో రజనీకాంత్ లగా ఆ పాము నుదుటి భాగంలో ముద్దు పెట్టబోయాడు. దీంతో ఆ పాము ఒక్కసారిగా రివర్స్ తిరిగి అతగాడి మూతిపై కాటేసింది. ఆ నొప్పికి ఆ వ్యక్తి పామును వదిలేశాడు. ఆపై మరొక వ్యక్తి ఆ పామును పట్టుకునే ప్రయత్నం చేయగా.. అది అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. పాముతో మూతిపై ముద్దు పెట్టించుకున్న వ్యక్తి వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. ఆ పాములో విషం మోతాదు తక్కువగా ఉండడం, సకాలంలో చికిత్స అందడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పాముతో లిప్ లాక్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తిపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. “నీ ఓవరాక్షన్ కి పాము రియాక్షన్ బాగుందిలే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
In a horrifying video which has surfaced online, a man from #Karnataka‘s #Shivamogga was bitten by the #Cobra on the lip when he tried to kiss it. He survived the #SnakeBite.#ViralVideo #Snake pic.twitter.com/d3ge1A5Wx6
— Hate Detector 🔍 (@HateDetectors) October 1, 2022
Inspire ayirupan pola pic.twitter.com/NbNUUlV5er
— susee ramesh (@SuseeRamesh) October 1, 2022