నీటిలో ఉండే జీవుల్లో మొసలి అత్యంత ప్రమాదకరమైన జీవి. ఇది తన సైజుకంటే ఎంత పెద్ద జీవినైనా చంపి తినేయగలదు. ముక్కలు ముక్కలు చేసి ఆరగించగలదు. మొసలి బారిన పడి బతకటం అన్నది చాలా అరుదు. పెంపుడు మొసళ్ల చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన యజమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి మొసలితో ఆటలు ఆడితే ఇంకేమైనా ఉందా. ఆట ఏమో కానీ, ఓ వ్యక్తి మొసలితో ఏకంగా డ్యాన్సే చేశాడు. అది కూడా నీటిలో.. అచ్చం ఓ అమ్మాయితో డ్యాన్స్ చేసినట్లు. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం మొసలి ఉన్న కొలనులోకి దిగాడు. మొసలిని గట్టిగా పట్టుకుని తల వరకు పైకి లేపాడు. తర్వాత దానితో మనిషితో డ్యాన్స్ చేసినట్లు డ్యాన్స్ చేశాడు. లాన్స్ అనే ట్విటర్ ఖాతాదారుడు ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15 మిలియన్ల వ్యూస్‌తో పాటు 4,56,000 లైక్స్‌ను సొంతం చేసుకుంది.
ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ఆ మొసలి అతడి పెంపుడు జంతువులా ఉంది. లేకపోతే అంత చేసినా ఎందుకు కామ్‌గా ఉంటుంది’’.. ‘‘ మొసలితో ఆట ఆడటం ప్రాణాలకు ప్రమాదకరం’’.. ‘‘ పిచ్చి పీక్స్.. మరీ ఇలా తయారయ్యారేంటి!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన గత మార్చి నెలలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికి మరో సారి వీడియో వైరల్‌గా మారి.. మొదటిసారి చూస్తున్న వారిని ఆశ్చర్యపరుస్తోంది.
Florida man strikes again pic.twitter.com/MAgGnFkymk
— Lance🇱🇨 (@BornAKang) October 18, 2022