టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఒక జేసీబీ డ్రైవర్ చేసిన పనికి సజ్జనార్ ఫిదా అయ్యారు. ఆ వీడియోను పోస్టు చేసిన సజ్జనార్.. ఆపద సమయంలో ఆదుకోవటమే మానవత్వం అనే సందేశాన్ని జోడించారు. దాన్ని చూసిన నెటిజన్లు సైతం జేసీబీ డ్రైవర్‌ను ప్రశంసిస్తున్నారు.
నేటికాలంలో చాలా మంది ప్రమాదంలో ఉన్న మనిషికి కూడా సాయం చేయలేనంతగా బిజీగా ఉన్నారు. ఇక నోరు లేని జీవాలు ప్రమాదంలో ఉంటే వాటి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమాదంలో ఉన్న జీవులను అందరూ చూస్తారు.. కానీ కొందరు మాత్రమే ఆదుకుంటారు. ఇంకా చెప్పాలంటే వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ.. మనుషులా మూగజీవాల ప్రాణాలు కూడా కాపాడుతుంటారు. తాజాగా ఓ జేసీబీ డ్రైవర్.. భారీ గుంతలో పడిపోయిన కుక్క కోసం రిస్క్ చేశాడు. తన పనిని పక్కన పెట్టి జేసీబీ సాయంతో చాలా సమయం పాటు శ్రమించి చివరకు ఆ కుక్కును కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుత టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నా నాటి నుంచి నేటి వరకు ఎన్నో విలక్షణమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని అభివృద్ధి పథంలో పయనించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇలా ఒకవైపు విధులు బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఆయన యాక్టీవ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి..ప్రజలకు వివిధ రకాల సలహాలు, సూచనలు, సందేశాలు ఇస్తుంటారు. అలాగే ఎవరైనా ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను సామాజిక మాద్యమం ద్వారా తెలియజేస్తే వెంటనే స్పందిస్తారు.
సంస్థలో పని చేసే వారిని ఎప్పటికప్పుడు పోత్సహిస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన ఓ వీడియో అందరిని తెగ ఆకట్టుకుంది. అందులో జేసీబీ డ్రైవర్ చేసిన పనికి సజ్జనార్ ఫిదా అయ్యారు. ఆ వీడియోను గమనిస్తే.. ఓ కుక్క పెద్ద గుంతలో పడిపోయి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో అక్కడే కొందరు జేసీబీలతో పనులు చేస్తున్నారు. వారిలో ఓ జేసీబీ డ్రైవర్ కుక్క పడుతున్న అవస్థలను గమనించాడు. జేసీబీ బొక్కెన సాయంతో కుక్కును బయటకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. అది రెండు మూడు సార్లు బొక్కెనకు మట్టి గోడ మధ్య సపోర్టుతో సగం వరకు పైకి వచ్చి.. అమాంతం కింద పడిపోయింది.
అలానే ఆ జేసీబీ డ్రైవర్.. బొక్కెనలో కుక్కును వేసుకునేందుకు ఎంత సేపు ప్రయత్నించిన.. అది పక్కకు వెళ్తుంది. చివరకు ఆ కుక్కకి దగ్గర బొక్కెనను పెట్టడంతో.. అది ఠక్కున లోపలికి వెళ్లింది. ఆ తరువాత డ్రైవర్ చాలా నెమ్మదిగా పైకి తీసుకొచ్చి ఓ పక్కన దించాడు. అందులో నుంచి దూకిన కుక్కు వెంటనే పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం” అంటూ వీడియోకు కామెంట్స్ జోడించారు. సజ్జనార్ షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగా ఆకట్టుకుట్టుంది.
Good work! ❤️
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం! pic.twitter.com/fwv8Vj8BnW
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 25, 2023