కట్టుకున్న భార్య మనసులో తాను లేనని తెలుసుకున్నాడు ఓ భర్త. కానీ .., అందరిలా అతను కోపపడలేదు. ఆవేశంతో ఆగిపోలేదు. ఆమె మనసు తెలుసుకుని, భార్యని ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. కాస్త వింతగా ఆశ్చర్యంగా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కోమల, పంకజ్ భార్య భర్తలు. వీరికి కొన్ని నెలల క్రితమే వివాహం అయ్యింది. కానీ.. పెళ్లి అయిన నాటి నుండే కోమల భర్తతో సవ్యంగా ఉండేది కాదు. పంకజ్ ఎన్ని విధాలుగా మాట్లాడి చూసినా ఆమెలో మాత్రం మార్పు రాలేదు. ఇక లాభం లేదనుకొని ఓ రోజు భార్యని గట్టిగా నిలదీశాడు. భర్త మంచితనం చూసి.. కోమల తన మనసులో మాటని బయట పెట్టింది. పెళ్లికి ముందు పింటు అనే వ్యక్తిని ప్రేమించాను. మా కుటుంబసభ్యులు నీతో బలవంతంగా నాకు పెళ్లి జరిపించారని కోమల వివరించింది. భార్య చెప్పిన మాటకి పంకజ్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. కానీ.., ఆ షాక్ నుండి త్వరగానే కోలుకుని ఓ నిర్ణయానికి వచ్చాడు పంకజ్.
ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి పంకజ్ అందరితో మాట్లాడాడు. ఈ 6 నెలల నుండి కోమల అనుభవించిన నరకం గురించి తెలియజేశాడు. ఈ మొత్తం సమయంలో తాను ఆనందంగా లేనని చెప్పుకున్నాడు. ఇలా.. రెండు కుటుంబ సభ్యులను ఒప్పించి చట్టబద్ధంగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పంకజ్ దగ్గర ఉండి.. పింటు, కోమల కి వివాహం జరిపించాడు.
స్థానిక ప్రభుత్వ సంస్థ ఆశా జ్యోతి కేంద్రంలో కోమల్, పింటులకు పెళ్లి జరిపించిన పంకజ్.. అన్నీ తానై వ్యవహరించాడు. ఓ లాయర్‌ను తీసుకొచ్చి, అవసరమైన పత్రాలను సిద్ధం చేశాడు. భర్తే భార్యకు దగ్గురుండి పెళ్లి జరిపిస్తున్న విషయం తెలిసి అక్కడి అధికారులు విస్తుపోయారు. ప్రస్తుతం పంకజ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో భర్త పంకజ్ గొప్పదనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.