వ్యవసాయం అంటే జూదం.. నష్టాలు తప్ప లాభాలు ఉండవు అని చాలా మంది భావిస్తారు. అది నిజం కూడా. అందుకే చాలా మంది రైతులు.. తమ బిడ్డలను వ్యవసాయం వైపు రానివ్వరు. చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయాలని ఆశిస్తారు. అయితే ప్రసుత్తం కాలం మారుతుంది. జనాల్లో ఆరోగ్యం పట్ల స్పృహ పెరుగుతుంది. ఖరీదైన సరే.. మంచి ఆహారం తీసుకోవాలని భావిస్తున్నారు. దాంతో ప్రస్తుత కాలంలో సేంద్రీయ ఆహార పదార్థల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆర్గానిక్ పంటలకు డిమాండ్ పెరుగుతోంది. ఇక ఈ మధ్యకాలంలో ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు వదులుకుని మరి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీరు సంప్రదాయ పంటలు కాకుండా.. మార్కెట్ ట్రెండ్‌కు అనుకూలంగా వేర్వురు రకాల పంటలు పండిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నారు.
ఫలితంగా మన దేశంలో ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ వంటి వాటి సాగు విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఓ కూరగాయ ధర ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా కేజీ 85 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర పలికి.. రైతలును లక్షాధికారులుగా మారుస్తుంది. మరి ఇంతకు ఆ కూరగాయ ఏంటి.. దాని సాగు ఎలా ఉంటుంది వంటి వివరాలు.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ధర పలుకుతున్న ఈ కూరగాయ పేరు ‘హాప్ షూట్స్’. ఇది ఒక ఔషధ పుష్పం, దీన్ని ఎక్కువగా వైన్ తయారీలో ఉపయోగిస్తారు. ఇదే కాక.. దీనికి వేరే ఇతర అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది. దాంతో ఈ కూరగాయకు ఇంత డిమాండ్. ఇక హాప్ షూట్ శాస్త్రీయ నామం హ్యూములస్ లుపులస్. ఇది జనపనార కుటుంబానికి చెందిన మొక్క. ప్రస్తుతం మనం చూసే ఇతర కూరగాయల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. భారతదేశంలో ‘హాప్ షూట్స్’ సాగు పెద్దగా విజయవంతం కాలేదు. కారణం ఇది ఉష్ణమండల మొక్క.
హాప్ షూట్స్ ఎక్కువగా ఉత్తర అమెరికా, యురేషియా, దక్షిణ అమెరికా ప్రాంతాలలో మాత్రమే పెరుగుతుంది. అక్కడి రైతులు దీన్ని పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఇక ఈ కూరగాయను.. కేజీ రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించి విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నారు. ఇక మనదేశంలో కూడా కొందరు హాప్ షూట్స్ సాగుకు ప్రయత్నించారు. కానీ పెద్దగా విజయవంతం కాలేదు. కారణం ఉష్ణోగ్రత. ఇక ఈ కూరగాయ రుచి.. కాకరకాయల చేదుగా ఉంటుంది. ఇక ఇందులో ఎన్నో రకాల ఔషధ లక్షణాలు ఉండటంతో.. విదేశాల్లో దీన్ని పచ్చిగానే తినడానికి చాలా మంది ఇష్టపడతారు.
ఇక హాష్ షూట్స్ పంట చేతికి రావాలంటే.. సుమారు మూడేళ్లకు పైగా సమయం పడుతుంది. హాప్ షూట్‌లకు పూసే పువ్వును బీర్ తయారీలో వినియోగిస్తారు. ఇక దీనిలో విటమిన్ ఈ, బీ6, సీలు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు అధికం. ఇక దీనిలో క్షయ వాధిని తగ్గించే ప్రతి రక్షకాలు కూడా ఉంటాయి. ఇక ఈ పంటను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు.. కోత సమయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బందుల మాట ఎలా ఉన్నా.. అధిక ధర పలుకుతుండటంతో.. విదేశాల్లో చాలా మంది దీన్ని పండించేందుకు ఆసక్తి చూపుతారు. ఇక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ మొక్కలు వరుసలో పెరగవు.. గుబురుగా ఉంటాయి కనుక కోత సమయంలో జాగ్రత్తగా కోయాల్సి ఉంటుంది.
Hop shoots are referred to as the world’s most expensive vegetable not only in India but all across the globe. Known for its medicinal properties, the vegetable is priced at €1,000 a kilo and INR 85,614(PKR 235,288) in India. . pic.twitter.com/lA82hZ0Hf9
— Startup Pakistan (@PakStartup) November 24, 2022