సాధారణంగా ఆటల పోటీలు అంటే.. ఒకే జాతి అంటే మనుషులు, జంతువులు ఇలా వీటి మధ్య జరుగుతాయి. కాదని.. మనుషులు, జంతువులు మధ్య ఇలాంటి పోటీలు పెడితే.. ఇదిలో ఇలా ఉంటుంది ఫలితం. రెజ్లింగ్ అంటే ఇద్దరు మనుషులు బరిలో నిలిచి తలపడతారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం.. కుక్కు, మనిషికి మధ్య రెజ్లింగ్ పోటీ పెట్టారు. కట్ చేస్తే.. ఏముంది కుక్క ప్రతాపం ముందు మనవాడు తేలిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసమే అన్నా.. కుక్కతో రెజ్లింగ్ పోటీ ఏంటి.. పిచ్చి కాకపోతే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఈ రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న కుక్క పేరు బార్డర్ కోలి. దాని పుట్టిన రోజు సందర్భంగా ఆ కుక్క యజమాని.. ఇలా రెజ్లింగ్ పోటీ ఏర్పాటు చేశాడు. వెస్ట్రన్‌ఫేర్‌లోని రెజ్లింగ్ రింగ్‌లో ఈ మ్యాచ్ ఏర్పాటు చేశాడు. ఇక రింగ్‌లోకి ఎంటరైన కుక్క.. వెంటనే మ్యాట్ అంత కలియతిరిగిన తర్వాత.. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులుకు అభివాదం చేసింది. ఆ తర్వాత తన ప్రత్యర్థి సైకో మైక్‌తో మ్యాచ్‌లో పాల్గోనేందుకు రెడీ అయ్యింది. ఇక ట్రెయినర్ ఆదేశాలను పాటిస్తూ.. బార్డర్ కోలి మ్యాచ్‌లో ఆడింది.
ఇక ముందుకు అనుకున్న ప్రకారం.. బార్డర్ కోలి.. సైకో మైక్ మీదకు రాగానే అతడు కింతడపడిపోయాడు. ఆ తర్వాత సైకో పైకి లేవకుండా మూడుసార్లు.. అతడి మీదుగా జంప్ చేసింది. ఇక బార్డర్ కోలి షాట్లు తప్పు అంటూ సైకో అప్పీల్ చేశాడు. ఆ తర్వాత అంపైర్ మూడుసార్లు.. కౌంట్ చేసి బార్డర్ కోలిని విజేతగా ప్రకటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. మీకేంది పిచ్చిరా నాయనా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
సాధారణంగా మనం ఇళ్లల్లో పెంచుకునే జంతువుల్లో కుక్కకి విశ్వాసం పాలు కాస్త ఎక్కువ. యాజమాని చెప్పిన మాటలను తూచా తప్పక పాటిస్తుంది. ఈ క్రమంలోనే కుక్కలకు బాంబ్ స్క్వాడ్ మరి కొన్ని అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఫలితంగా అవి మనుషులతో సమానంగా పని చేస్తాయి. ఇక విదేశాల్లో రాట్ వీలర్స్, పిట్‌బుల్స్‌లాంటి కుక్కలకు ఫైటింగ్ ఏర్పాటు చేస్తారు. దీనికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఇక ఈ ఫైట్స్‌పై పెద్ద మొత్తంలో బెట్ కాస్తూ.. కాసుల వర్షం కురిపిస్తారు. అయితే ప్రస్తుతం మాత్రం.. కుక్క బర్త్‌డే సందర్భంగా ఇలా రెజ్లింగ్ పోటీ ఏర్పాటు చేశాడు దాని యజమాని.
Who wants to see a BIRTHDAY-slam?!
Wishing a big happy birthday to @iAmPsychoMike
We hope it goes better for him than this surprise match on Saturday did…
Big thanks to @JenandDaiquiri for joining forces to put on a one of a kind match at @WesternFair pic.twitter.com/iRY9R6SSO6— Smash Wrestling (@smashwrestling) September 21, 2022