Viral Video: జిహ్మకో రుచి, పుర్రెకో బుద్ధి అన్న చందాన నేటి యువత ప్రేమ పేరుతో వెర్రి తలలు వేస్తోంది. యువతీ, యువకులు ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఇంటర్ చదివే ఓ బాలిక, ఓ బాలుడు బరితెగించారు. చదువుపై దృష్టిపెట్టాల్సిన వయసులో ప్రేమకు జైకొట్టారు. ఏకంగా బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చిదంబరానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ గాంధీ విగ్రహం దగ్గరలో ఉన్న ఓ బస్టాండ్ దగ్గర కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాలుడు, బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు.
పక్కనే ఉన్న మరికొందరు వారికి మద్దతుగా అల్లరి చేస్తూ.. పూలు చల్లారు. ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కాస్తా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ వీడియోపై అధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కొద్దిరోజుల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి కడలూర్‌లో వెలుగు చూసింది. ఓ 23 ఏళ్ల వ్యక్తి ఓ మైనర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి జరిగి సంవత్సరం అయింది. అయితే, తాజాగా, ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడ్ని, అతడి తండ్రిని అరెస్ట్ చేశారు.
காலேஜ் மாணவிகள் பரவாயில்லை ஆனால் பள்ளி மாணவிகள் நிலை மோசம் ஆகிரது பெற்றோர்கள் மாணவிகளின் ஸ்கூல் பேக் & மொபைலை பெற்றோர்கள் கண்காணிக்கவும்😭😭😭 pic.twitter.com/BUdtkbCGVq
— SP Chhandak (@CHHANDAK175) October 10, 2022