Police: ప్రజల్ని సక్రమ మార్గంలో నడిపించడానికి కృషి చేయాల్సిన పోలీసులే తప్పుదోవపడుతున్నారు. కొందరు పోలీసులు తాము పోలీసులమన్న సంగతి మర్చిపోతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో చిల్లర దొంగల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ పోలీసు రోడ్డు పక్కన నిద్రపోతున్న ఓ అభాగ్యుడి సెల్‌ఫోన్ కొట్టేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న షాపుల ముందు నిద్రపోతున్నాడు. అతడితో పాటు చాలా మంది అక్కడ నిద్రపోతూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఓ ఇద్దరు పోలీసులు అటునుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఓ పోలీస్ రోడ్డు పక్కన పడుకున్న వ్యక్తి వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇంతలో అతడి దృష్టి నిద్రపోతున్న వ్యక్తి ఫోన్‌పై పడింది. అక్కడినుంచి ముందుకు దాటుకు వెళ్లిపోయిన ఆ పోలీస్.. మళ్లీ వెనక్కు వచ్చాడు. నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. మరో పోలీస్ కూడా వెనక్కు వచ్చాడు. దూరంగా నిలబడి ఇంకో పోలీస్ చేస్తున్న పనిని చూస్తూ ఉన్నాడు. నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లిన పోలీస్ అతడి సెల్‌ఫోన్ తీయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ను నిద్రపోతున్న వ్యక్తి దగ్గరినుంచి పక్కకు తీశాడు. ఆ వెంటనే సెల్‌ఫోన్‌తో అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల తాలూకా వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. పోలీసుల తీరును తప్పు బడుతున్నారు. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Shameful act of Kanpur Police
The soldiers patrolling at night stole the phone of the sleeping person, the incident was captured in CCTV @drlaxmanbjp Anna Any words on this ?#doubleengine sarkaaru👇 pic.twitter.com/YdnFcbmxpb
— AkshayKTRS (@AkshayKtrs) October 9, 2022