ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఎయిర్‌పోర్టులో గొడవ పడ్డం ఏంట్రా’’ అంటూ మండిపడుతున్నారు.
మనుషుల మధ్య గొడవలు జరగటానికి ఈ మధ్య కాలంలో పెద్దగా కారణం ఉండాల్సిన పని లేకుండా పోయింది. కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటున్నారు. గల్లీల్లో ఉండే వాళ్ల దగ్గరి నుంచి బెంజి కార్లలో తిరిగే వాళ్ల వరకు ఎవ్వరూ ఇందుకు అతీతం కాకుండా పోయింది. తాజాగా, ఓ ప్రఖ్యాత ఎయిర్‌పోర్టులో కొంతమంది భీకర యుద్దానికి దిగారు. తోటి ప్రయాణికులు చూస్తుండగా కలబడి కుమ్ముకున్నారు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని చికాగోలో ‘‘ఓ హారే ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు’’ ఉంది. ఈ ఎయిర్‌పోర్టు నిత్యం రద్దీగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితం లగేజీ తీసుకునే ప్రదేశంలో ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలివాన అయింది.
కొద్దిసేపటి తర్వాత ఆ గొడవ రెండు గ్రూపుల గొడవగా మారింది. దాదాపు ఓ పది మంది రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవటం మొదలుపెట్టారు. అది కూడా ముష్టి ఘాతాలతో కొట్టుకుంటూ.. కింద, మీద పడి దొర్లి భీకరంగా గొడవ పడ్డారు. ఈ సంఘటన మే 22న రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ డబ్బు బాగా ఎక్కువయిపోయి కొట్టుకుంటూ ఉన్నారు’’.. ‘‘ ఎర్ర బస్సు కోసం వచ్చిన వాళ్లు కొట్టుకున్నట్లు ఆ కొట్టుకోవటం ఏంట్రా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sent in video of a brawl this morning at O’Hare International Airport.#Chicago pic.twitter.com/AiiLrobUk8
— 16th & 17th District Chicago Police Scanner (@CPD1617Scanner) May 23, 2023