1947 సమయంలో జరిగిన దేశ విభజన ప్రక్రియ ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. చాలా కుటుంబాలు ఆ సమయంలో జరిగిన అల్లర్ల కారణంగా కొందరు పాకిస్తాన్ వెళ్తే, మరికొందరు ఇండియాలోనే ఉండిపోయారు. అలా విడిపోయిన ఓ అన్నదమ్ములు సోషల్ మీడియా ద్వారా 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.
1947లో ఆనాటి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా భారతదేశాన్ని పాక్, ఇండియాగా విభజించారు. ఆ విభజన సమయంలో జరిగిన అల్లర్ల కారణంగా ఎంతో మంది చనిపోయారు. అంతే కాకుండా హిందు, ముస్లిం, సిక్కులు ఇలా చాలా మంది కుటుంబ సభ్యులు కొందరు ఇండియాలో ఉంటే, మరికొందరు పాకిస్తాన్ కు వెళ్లిపోయారు. అలా ఎంతోమంది తమ కుటుంబాలను వదులుకుని దూరంగా వెళ్లిపోయరు. అయితే ఆ విభజన సమయంలో కనిపించకుండాపోయిన ఓ అన్నదమ్ములు 75 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఈ కలయిక అసలు ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1947లో బ్రిటిష్ పార్లమెంట్ చట్టం ద్వారా ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలుగా మారిపోయాయి. ఆ సమయంలో కుటుంబాలలోని కొందరు వ్యక్తులు ఇండియాలో ఉంటే మరి కొందరు పాకిస్తాన్ కు వెళ్లారు. సరిగ్గా అలాగే వెళ్లిన ఇద్దరు సోదరులు తాజాగా పాకిస్తాన్ లో కలుసుకున్నారు. అసలేం జరిగిందంటే? హర్యానా మహేంద్రనగర్ జిల్లాలోని గోమ్లా గ్రామంలో దయా సింగ్, గురుదేవ్ సింగ్ అనే అన్నదమ్ములు నివసించేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత వీరి తండ్రి మరణించాడు. దీంతో అప్పటి నుంచి సోదరులిద్దరూ తండ్రి స్నేహితుడైన కరీం బక్ష్ తో ఉండేవారు.
ఇదిలా ఉంటే 1947లో జరిగిన దేశ విభజన సమయంలో ఏం జరుగుతుందో తెలియక చాలా మంది కుటుంబాలను వదిలి పాకిస్తాన్ కు వెళ్లారు. అయితే అదే సమయంలో వీరి తండ్రి ఫ్రెండ్ కరీం బక్ష్ పాకిస్తాన్ ను వెళ్తుండడంతో గురుదేవ్ సింగ్ కూడా అతని వెంటే వెళ్లాడు. అతని సోదరుడు దయాసింగ్ మాత్రం తన మేనమామతో కలిసి హర్యానాలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత అన్నదమ్ములు ఎక్కడున్నారనేది తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు.
కానీ, ఎంత ప్రయత్నించినా ఒకరి ఆచూకి ఒకరిు తెలుసుకోలేకపోయారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ద్వారా దయా సింగ్, గురుదేవ్ సింగ్ అన్నదమ్ములు 75 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో కలుసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఒకరికొకరు చూసుకుని సంతోషంతో మురిసిపోయారు. వీరి కలయికలో భాగంగా దిగిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ అన్నదమ్ముల కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.