భార్యభర్తల గేమ్ షో లు చాలా చూసి ఉంటాం. ఏంటంటే.. భర్త కళ్లకు గంతలు కట్టి భార్యని గుర్తు పట్టాలి అని టెస్ట్ పెడతారు. సాధారణంగా అమ్మాయిల చేతులు మృదువుగా ఉంటాయి. దీంతో మగాళ్లు వారి భార్యలను గుర్తుపట్టడం కష్టం అవుతుంది. కానీ ఓ బుడ్డోడు మాత్రం అలా కాదు.. ఎంత మంది తన ముందు ఉన్నా.. తన అమ్మను గుర్తుపట్టేసి అందరిని ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్టో వైరల్ అవుతోంది.
ఎక్కడ ఉన్న పేగు బంధంతో పిల్లలు.. తమ తల్లి ఎక్కడ ఉన్న గుర్తుపటేస్తారు. అలానే ఓ బుడ్డోడు..ఓ చోట ఎంత మంది మహిళలు ఉన్నా.. అమ్మను మాత్రం ఈజీగా గుర్తు పట్టేశాడు. నలుగురు మహిళలు పసుపు రంగు చీర కట్టుకుని ముఖన్ని కొంగుతో దాచేసి ఒకే దగ్గర కూర్చున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన బుడతడు.. వారిలో తన తల్లి ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అందరు మహిళలు చిన్నోడిని రమ్మని పిలవడంతో కాస్త అయోమయంలో పడ్డాడు. ఆ నలుగురిలో తల్లి ఎవరో తెలియక సతమతం అయ్యాడు.
మొదటగా ఓ మహిళ దగ్గరకు వెళ్లి వెంటనే తిరిగి వచ్చేశాడు ఆ తర్వాత చివర్లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా.. అమ్మా.. అని పిలిచాడు. పైకి ఎక్కి కూర్చుని ముఖంపై ఉన్న కొంగును తీశాడు. అంతే.. తల్లి కనిపించేసరికి నవ్వాడు. దీంతో అంతమందిలో కూడా తనను గుర్తు పట్టినందుకు ఆ బుడ్డోడి తల్లి ఓ ముద్దు ఇచ్చింది. అక్కడున్న వాళ్లు కూడా అరుస్తూ చప్పట్లు కొట్టారు. ఈ వీడియో కాస్తా చూసిన నెటిజన్లు వారేవ్వా అంటున్నారు. మరీ ఈ బుడ్డోడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.