ఈ రోజుల్లో ప్రధానంగా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్య గుండెపోటు. వయసుతో తేడా లేకుండా ఇటు చిన్న పిల్లల నుంచి., అటు వృద్దుల ఒక్కరు.. చాలా మంది గుండె పోటుతో మరణిస్తూ వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిపోతున్నారు. ఇటీవల కాలంలో నాటక డ్యాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, ప్రదర్శన చేస్తూ ఎంతో మంది ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. అచ్చం ఇలాగే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ఓ వ్యక్తి నాటక ప్రదర్శన చేస్తూ స్టేజ్ మీదే గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
ఈ వీడియోను చూసిన చాలా మంది చావు ఎవరికి, ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదని ఉలిక్కిపడి భయపడిపోతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. యూపీలోని జాన్ పూర్ పరిధిలోని బెలాసిన్ గ్రామంలో సోమవారం రాత్రి రామ్ లీలా నాటక ప్రదర్శనను నిర్వహించారు. ఈ నాటకాన్నిచూసేందుకు ఊళ్లో జనాలంత వచ్చారు. ఇక ఈ నాటక ప్రదర్శనలో రామ్ ప్రసాద్ అనే కళాకారుడు శివుడి పాత్ర వేశాడు. ఇక నాటకంలో భాగంగా అతను నిలబడి పద్యాలు పాడుతుండగా ఒక్కసారిగా ఉన్నట్టుండి స్టేజ్ మీదే అందరూ చూస్తుండగా కుప్పకూలిపడిపోయాడు.
వెంటనే స్పందించిన తోటి కళాకారులు అతడిని హుటాహుటిన చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు గుండె పోటుతో మరణించినట్లు వైద్యలు నిర్ధారించారు. ఈ వార్త విన్న రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు గుండె పగిలినంత పనైంది. మా కుటుంబ పెద్దను కోల్పోయామంటూ కన్నీటి సంద్రంలో మునిగి తేలారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. నాటక ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా స్టేజ్ మీదే కుప్పకూలిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
आरती के दौरान अचानक मंच पर गिर पड़ा शख्स | Unseen India pic.twitter.com/M8wdUhu1NF
— UnSeen India (@USIndia_) October 11, 2022