ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. రోజుకి కనీసం 10 గంటల పాటు పుస్తకాలతో కుస్తి పడితే తప్పా కోరుకున్న గవర్నమెంట్ జాబ్ ను సంపాదించలేము. అలా ఎంతో మంది ఆశపడే ప్రభుత్వం ఉద్యోగాన్ని ఓ యువతి తృణప్రాయంగా వదిలేసింది. ఇక వదిలేసిన ఆ యువతి అలాంటి వీడియోలు చేస్తూ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది. అసలు ఆ యువతి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసింది? ఆ తర్వాత ఎలాంటి వీడియోలు చేస్తుంది అనేది తెలుసుకోవాలనుందా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.ఝార్ఖండ్ లోని బొకారో ప్రాంతంలో రేష్మా రంజాన్ అనే యువతి నివాసం ఉంటుంది.
చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణించిన ఆ యువతి అందరి చేత శభాష్ అనిపించుకునేది. అలా రేష్మా ఉన్నత చదువుల్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసోర్సెస్ లో వ్యవసాయం శాస్త్రాన్ని పూర్తి చేసింది. అయితే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ప్రయత్నంలో భాగంగానే ఆ యువతి వచ్చిన అన్ని ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేది. అలా 2015లో రేష్మా రంజాన్ కష్టపడి చదివి అగ్రికల్చర్ కో ఆర్డినేటర్ గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. అలా రేష్మా రంజన్ కొంత కాలం పాటు ఆ ఉద్యోగంలో చేరి తన సేవలు అందించింది.ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కొంత కాలం తర్వాత రేష్మా రంజన్ ఆమె ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి తృణప్రాయంగా వదిలేసింది.
దీంతో అప్పటి నుంచి ఆ యువతి మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తితో చెట్లను పెంచుతూ ఉంది. ఇక పెంచడమే కాదండోయ్.. ప్రకృతి గార్డెన్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ను కూడా ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఆ యువతి మొక్కలు ఎలా పెంచాలి? గార్డెన్ ఏరియా ఎలా ఉండాలి? వాటిని ఎలా సంరక్షించుకోవాలని అని ఎన్నో టిప్స్ చెప్పేది. అలాంటి వీడియోలు రోజుకొకటి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తూ.. ఆ యువతి ఇప్పుడు లక్షల్లో వ్యూస్ ను రాబడుతు నెలకు లక్షలు సంపాదిస్తుంది. ఇక మరో విషయం ఏంటంటే? తన యూట్యూబ్ ఛానెల్ కు దాదాపుగా 9 లక్షల మంది సబ్ స్కైబర్లను సాంపాదించినట్లు తెలుస్తోంది. ఇక ఇష్టమైన పని చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్న రేష్మా రంజన్ స్టోరీపై నెటిజన్స్ విభిన్నరీతిలో కామెంట్స్ చేస్తున్నారు.