తల్లిదండ్రులు కొడుకు చదువు మానేసి జులాయిగా తిరుగుతుంటే ఇలా తిరిగితే బాగుపడవని, గాడిదలు కాచిన పనికి రావు అంటూ తిడుతుంటారు. కానీ అదే గాడిదలు కాచిన వ్యక్తి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. అవును.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని మంగళూరు ప్రాంతం. శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి గతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా బలంగా నిలదొక్కుకున్నాడు. కానీ అతనికి ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ఏదో తెలియని వెలితి కనిపించింది.
దీంతో ఆ ఉద్యోగం నచ్చకపోవడంతో సాఫ్ట్ వేర్ జాబ్ వద్దనుకుని దానిని వదిలేశాడు. అనంతరం ఏం చేయాలనే ఆలోచనలో భాగంగా అతనికి ఓ ఐడియా తట్టింది. అదే గాడిదలను పెంచుకోవడం. గాడిదలు పెంచుకుని వాటి ద్వారా వచ్చిన పాలతో వ్యాపారం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం శ్రీనివాస గౌడ రూ.42 లక్షల పెట్టుబడితో 20 గాడిదలు తెచ్చుకున్నాడు. దీంతో వాటిని మెపుతూ పెంచుకోవడం మొదలు పెట్టాడు. ఇక కొన్నాళ్లకి అవి పాలు కూడా ఇస్తున్నాయి. శ్రీనివాస గౌడ 30 ML పాలను రూ.150 కి అమ్ముతు నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Men: భార్యా బాధితుల వింత పూజలు.. ‘దేవుడా! ఈ భార్యలు 7 సెకన్లు కూడా మాకొద్దు’..
ఈ గాడిద పాల వ్యాపారంపై మాట్లాడిన శ్రీనివాస గౌడ… నేను మొదట్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడిని, కానీ అది నచ్చకపోవడంతో ఇలా గాడిదలను తెచ్చుకున్నాను. ఇప్పుడు నా వద్ద 20 గాడిదలు ఉన్నాయి. ఈ గాడిద పాలు ఆరోగ్యానికి మంచివి కావడంతో అందరూ వీటిని కొనుగోలు చేసుకుందుకు ముందుకు వస్తున్నారు. ప్రతీ ఒక్కరికి గాడిద పాటు అందుబాటులోకి తేవడమే నా లక్ష్యం. ఇప్పటీకి రూ.17 లక్షల ఆర్డర్ లు వచ్చాయని శ్రీనివాస గౌడ తెలిపారు. శ్రీనివాస గౌడ గాడిద పాల బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.