Love Couple: ఈ మధ్య కాలంలో ఆడ, మగ మధ్య వయసు వ్యాత్యాసం ఎక్కువగా ఉన్న పెళ్లిళ్లు జరగటం మామూలైపోయింది. కొన్నేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి 24 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడా ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆగస్టుల నెలలో తమిళనాడుకు చెందిన ఓ 68 ఏళ్ల వ్యక్తి 28 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా బంధువులు కుదిర్చిన పెళ్లి కావటం విశేషం. తాజాగా, ఓ 78 ఏళ్ల ముసలి వాడు 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమ పెళ్లి. ఈ సంఘటన ఫిలిప్పిన్స్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పిన్స్‌లోని కగయాన్ ప్రావిన్స్‌కు చెందిన 78 ఏళ్ల రషద్ మంగాకాప్ బ్రహ్మచారి. ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ డిన్నర్ పార్టీలో అతడికి హలీమా అబ్ధుల్లా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మొగ్గ తొడిగింది. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరూ మూడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తర్వాత హలీమా తన తల్లిదండ్రులతో పెళ్లి గురించి మాట్లాడింది. మొదట వాళ్లు ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నారు.
తాజాగా, వీరి పెళ్లి ఘనంగా జరిగింది. బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. దీనిపై రషద్ సోదరుడి కుమారుడు మాట్లాడుతూ.. ‘‘ మొదటి ఆ అమ్మాయే మా పెదనాన్నతో ప్రేమలో పడింది. ప్రపోజ్ చేసింది. మా పెదనాన్నకు ఇంకా పెళ్లి కాకపోవటంతో ఇరు కుటుంబాల వాళ్లు పెళ్లికి ఓకే చెప్పారు’’ అని తెలిపాడు. ఈ కొత్త జంట ప్రస్తుతం కార్మెన్ టౌన్లో నివాసం ఉంటోంది. అతి త్వరలో వేరే ఇళ్లు తీసుకుని వేరు కాపురం పెట్టడానికి చూస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంట పెళ్లిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.