సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి బయలుదేరుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా ఇరువురి మద్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేసుకున్నందుకు ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సోమవారం తన నివాసం నుంచి సిట్ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల లోటస్ పాండ్ వద్ద పోలీసుల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మద్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వాహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు షర్మిల కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు బెయిల్ మంజూరు అయ్యింది.. చంచల్ గూడ జైలు లో ఉన్న ఆమెకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. రూ. 30 వేల పూచికత్తుతో పాటు ఇద్దరు జామీను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశిచింది. అంతేకాదు ఒకవేళ విదేశాలకు వెళ్లవలసి వస్తే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందిగా షరతులు విధించింది. విడుదల ఆర్డర్ తో షర్మిల తరుపు న్యాయవాదులు చంచల్ గూడ జైలుకు వెళ్లారు.. విడుదల ఆర్డర్ ను చంచల్ గూడ జైలు అధికారులకు సమర్పించారు. తరువాత షర్మిలను చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. షర్మిల విడుదల నేపథ్యంలో చంచల్ గూడ జైలుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె లోటస్ పాండ్ కి బయలుదేరారు.