ఈ సమాజంలో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేవారు చాలా మందే ఉన్నారు. ఏదైన ఉచితంగా లభిస్తుందంటే చాలు దాని కోసం ఎంతకైన తెగిస్తుంటారు. ఇక విషయం ఏంటంటే? తాజాగా మెదక్ జిల్లాలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కోళ్ల వ్యాన్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీనిని గమనించిన వాహనదారులు, గ్రామస్తులు పొలంలో పడ్డ కోళ్లను ఎగబడి మరీ పట్టుకెళ్లారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మెదక్ జిల్లా రామయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం రోడ్డుపై ఓ కోళ్ల వ్యాను వెళ్తుంది. అయితే అదుపు తప్పి ఆ కోళ్ల వ్యాన్ ఒక్కసారిగా గ్రామ శివారులోని వరి పొలంలో బోల్తా పడింది.
వెంటనే గమనించిన ఆ గ్రామంలోని ప్రజలు, వాహనదారులు వరిలోకి దిగి కిందపడ్డ కోళ్లను పట్టకున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా చేతుల్లో ఎన్ని పడితే అన్ని పట్టుకెళ్లిపోయారు. దీనిని చూసి ఊళ్లోని జనాలు పరుగు పరుగున వచ్చి అందిన కాడికి కోళ్లను పట్టుకెళ్లిపోవడంతో పాటు చేతికందని వరి పంటను అంతా నాశనం చేశారు. ఇలా దారిన పోయేవారంత ఐదు, ఆరు కోళ్లకు పైగా తీసుకెళ్లి పండగా చేసుకున్నారు. అయితే కోతకు వచ్చిన చేనులోనే ఆ కోళ్ల వ్యాను బోల్తా పడడంతో రైతు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్ధానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.