తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సజ్జనార్ అనుక్షణం ఆర్టీసీ సేవలు ప్రతి ఒక్కరికీ చేరువ అయ్యే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీ గురించి పలు వీడియోలు, పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆర్టీసీ సేవలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి చూపులు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తుండటంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఆర్టీసీ ప్రచారానికి భలే వాడేసుకున్నారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ అర్థాన్ని కూడా పూర్తిగా మార్చేసి కొత్త భాష్యం చెప్పారు. ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాట నెత్తురు మరిగితే ఎత్తుర జెండా పాట వీడియోను ఎడిట్ చేసి తెలంగాణ ఆర్టీసీని ప్రమోట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ అంటే “రణం, రౌద్రం, రుధిరం” అనుకుంటున్నారా…. కాదు.. “రాష్ట్ర రోడ్డు రవాణా” సంస్థ అంటూ తనదైన శైలిలో ఆర్‌ఆర్‌ఆర్‌కు సరికొత్త అర్థాన్ని చెప్పారు సజ్జనార్.
ఎన్టీఆర్, రామ్ చరణ్ పట్టుకున్న జెండాపై ‘వందేమాతరం’ అని ఉండగా సజ్జనార్ మాత్రం వాటి స్థానంలో టీఎస్ఆర్‌టీసీ అని రాయడంతోపాటు దాని కింద బస్సు, లోగోను పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు ఆయన క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. ఇక తారక్, చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ మూవీని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ తదితరులు నటిస్తుండగా కీరవాణి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TSRTC is at the Service of Public #RRR – రాష్ట్ర రోడ్డు రవాణా #TSRTCPublicService #EtharaJenda @TSRTCHQ @baraju_SuperHit @MilagroMovies @tarak9999 @ssrajamouli @AlwaysRamCharan @TarakFans @Chiru_FC @worldNTRfans @NTR2NTRFans @RRRMovie @AlwaysCharan_FC @TrackTwood @TV9Telugu pic.twitter.com/XybL6SDQWt
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.