హైదరాబాద్: ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. టికెట్ తో పాటు తాగు నీరు అందించేలా మంచి నీళ్ల బాటిళ్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ‘జీవా’ పేరుతో ప్రారంభించబోతున్న ఈ సేవ సోమవారం నుండి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ టికెట్ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. తెలంగాణాలోని ప్రతి బస్సు ప్రాంగణాల్లో కూడా ఇవి లభిస్తాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ధర ఎంత అనేది వెల్లడించలేదు.
మార్కెట్ తో పోలిస్తే తక్కువ ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏసీ బస్సు ప్రయాణీకులకు మాత్రం అర లీటర్ బాటిల్ ను ఉచితంగా అందించనుంది. కల్తీ నీరు కట్టడి చేసి, స్వచ్ఛమైన, పరిశుభ్రమైన తాగు నీటిని అందించేందుకు టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్ తో వస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. స్పింగ్ ఆఫ్ లైఫ్ ట్యాగ్ లైన్ తో తీసుకువస్తున్న ఈ వాటర్ బాటిళ్ల డిజైన్ కూడా వినూత్నంగా డైమెండ్ షేప్ తో రూపొందించారు. ప్రస్తుతం కేవలం ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఈ సేవను అనంతరం ప్రభుత్వ కార్యాలయాల్లోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బహిరంగ మార్కెట్ లోకి తీసుకు రానున్నట్లు సమాచారం.
టీఎస్ఆర్టీసీ ఎండిగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి.. రవాణా సంస్థను లాభాల బాట పట్టించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆర్టీసీలో ప్రయాణించడం సురక్షితమని ఆయనే స్వయంగా ప్రచారం చేయడమే కాకుండా.. కుటుంబ సభ్యులతో కూడా కలిసి ప్రయాణించి..వార్తల్లో నిలిచారు. సరుకు రవాణా, లాజిస్టిక్ సేవలు వంటి వినూత్న నిర్ణయాలతో నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని ఓ గాడిన పెట్టారు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ కొత్త నిర్ణయం.. అటు టిఎస్ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చి పెట్టడంతో పాటు ప్రయాణీకులు కూడా సురక్షితమైన నీటిని తాగమన్న ఫీలింగ్ ను తీసుకురానుంది. మరి టీఎస్ఆర్టీసీ ప్రెవేశపెడుతున్న జీవా వాటర్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన #TSRTC జీవా వాటర్ బాటిళ్లు నేటి నుంచి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. #Hyderabad MGBS లో రవాణా మంత్రి అజయ్ కుమార్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, R & B కార్యదర్శి శ్రీనివాస రాజుతో కలిసి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/JlIQdmiOZW
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) January 9, 2023
#Watchlive Launch of ‘ZIVA’. https://t.co/u4VwCEhekK
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) January 9, 2023