నాన్నా.. నేనిక బతకను. అమ్మను తిట్టకు, కొట్టకు బాగా చూసుకో.. అంటూ చనిపోయే ముందు కూతురు తండ్రికి చెప్పిన చివరి మాటలు విన్న ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలేం జరిగిందంటే?
ఈ బాలిక పేరు నవనీత, వయసు 13 ఏళ్లు. బాగా చదువుకుని జీవితంలో గొప్పగా స్థిరపడాలని ఎన్నో కలల కనింది. అందులో భాగంగానే స్కూల్ కు వెళ్లి తోటి స్నేహితులతో కలిసి బాగానే చదువుకునేది. ఇక తల్లిదండ్రులు స్థానికంగా కూలీనాలి పనులు చేస్తు సంసారాన్ని నెటకొస్తున్నారు. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలోనే ఓ మాయదారి రోగం ఆ బాలికను పొట్టనపెట్టుకుంది. ఇన్ని రోజులు కళ్లముందు ఆడుతూ, పాడుతూ తిరిగిన కూతురు.. ఇక రాదు, కనిపించదు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
అది రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలంలోని ఓ గ్రామం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరికి నవనీత (13) అనే కూతురు జన్మించింది. ఇక ఉన్న ఊరిలో ఆ భార్యాభర్తలు కూలీనాలి పనులు చేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చారు. కానీ, ఆ మహిళ భర్త తరచు భార్యను తిడుతు కొట్టేవాడట. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి నవనీత కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ నొప్పి తీవ్ర తరం కావడంతో ఆ బాలికను తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నేను చనిపోతా అని తెలుసుకున్న ఆ బాలిక.. తండ్రితో చివరి సారిగా మాట్లాడింది. నాన్నా.. నేనిక బతకను. అమ్మను కొట్టకు, తిట్టకు. బాగా చూసుకో అంటూ తండ్రికి చెప్పింది. కూతురు మాటలు విన్న ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇక చికిత్స పొందుతూ ఆ బాలిక శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. మొన్నటి వరకు ఊళ్లో ఆడుతూ పాడుతూ తిరిగిన నవనీత.. ఇక కనిపించదు, రాదు అన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.