పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు శ్రీజ. వయసు 9 ఏళ్లు. అయితే సోమవారం రాత్రి ఇంట్లో కరెంట్ పోయింది. దీంతో ఉక్కపోతగా ఉండడంతో అందరూ ఆరుబయట నిద్రపోయారు. ఇక తెల్లవారుజామున పాపం, ఆ చిన్నారిపై ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
హన్మకొండలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉక్కపోతగా ఉందని ఆ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రించింది. ఇక తెల్లవారుజామున జోరు నిద్రలో ఉన్న చిన్నారిపై ఎవరూ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. కన్నవారి ముందే ఈ ఘటన జరగడంతో ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే?
గ్రామస్థుల కథనం ప్రకారం.. తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామం. ఇక్కడే కన్నె సురేందర్-రజిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ కుమారుడు, కూతురు శ్రీజ (9) జన్మించారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి ఈదురుగాలులు వీస్తుండడంతో ఊళ్లో కరెంట్ పోయింది. దీంతో ఇంట్లో ఉక్కపోతగా ఉండడంతో ఆ దంపతుల పిల్లలతో పాటు ఆరు బయట పడుకున్నారు. రాత్రంతా అక్కడే నిద్రపోయారు. ఇక తెల్లవారు జామున తల్లిదండ్రులు నిద్రలేచారు.
అదే సమయానికి ఊదురుగాలులు విపరీతంగా వీచాయి. ఈ దంపతుల కూతురు శ్రీజ మాత్రం బయట మంచంపై జోరు నిద్రలో ఉంది. ఇదే సమయంలోనే వారి ఇంటి ముందుకున్న చెట్టు ఆ గాలులకు విరిగి ఆ చిన్నారిపై పడింది. దీంతో వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు చుట్టు పక్కల వారి సాయంతో ఆ చెట్టును ఆ చిన్నారి మీద నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆ చిన్నారిని లేపే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో శ్రీజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణించడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.