ఈ మద్య పలు సందర్భాల్లో నగర వాసులకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పండుగలు, భారీ బహిరంగ సభలు, ర్యాలీల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్న విషయం తెలిసిదే. ఇక రంజాన్ పండుగ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నగరంలో రేపు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 21 వ తేదీన హైదరాబాద్ లోని మక్కా మసీదు, సికింద్రాబాద్ పరిధిలోని జామియా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జుమాత్ ఉల్ విద ప్రార్ధనల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
చార్మీనార్ నుంచి వెళ్లే పలు రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక పోలీసులు ప్రకటించారు. చార్మినార్ – రాజేశ్ మెడికల్ హాల్, చార్మినార్- ముర్గీ చౌక్, చార్మినార్ – మదీనా మద్య రాకపోలను పూర్తిగా నిషేదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ నుంచి సిటీ కాలేజ్ సైడ్ కి మళ్లిస్తారని సమాచారం. కోట్ల అలిజా నుంచి చార్మినార్ వైపు వచ్చే పలు వాహనాలను అమన్ హూటల్ వైపు మళ్లించనున్నారు.
సికింద్రబాద్ పరిధిలో సుబాష్ రోడ్, మహంకాళి పీఎస్, ఎంజీ రోడ్డు, రాంగోపాల్ పేట జంక్షన్ లో వెళ్లే వాహనాలు ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు మూసివేయనున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. నగర ప్రజలు ట్రాఫిక్ ఆంక్షల విషయంలో అలర్ట్ గా ఉండాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరోవైపు రంజాన్ పండుగ పురస్కరించుకొని నగరంలోని మసీదులు రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు.