పురాతకాలానికి సంబంధించిన వస్తువులు, కట్టడాలు, ఇతర శిలాశాసనాలు తరచూ బయటపడుతుంటాయి. ఈ ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం కొందరు వేట సాగిస్తుంటారు. అలాంటి సమయంలో వారికి షాకింగ్ సీన్లు కనిపిస్తుంటాయి.
పురాతకాలానికి సంబంధించిన వస్తువులు, కట్టడాలు, ఇతర శిలాశాసనాలు తరచూ బయట పడుతుంటాయి. అలానే పూర్వం రాజులు ఏర్పాటు చేసుకున్న గుహలు, సొరంగ మార్గాలు కూడా బయటపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. అందులో గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతో ఇద్దరు యువకులు లోపలి వెళ్లగా..11 అడుగుల పాము కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో పురాతన కాలానికి సంబంధించిన కట్టడాలు, శిలాశాసనాలు, సొరంగ మార్గాలు బయటపడుతుంటాయి. ఇదే సమయంలో కొందరు గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల్లో, కట్టడాల్లో, సొరంగాల్లో వేటా సాగిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలో అత్తాపూర్ ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. రాజేంద్రనగర్ లోని ఓ పురాతన భవనంలో ఈ సొరంగం వెలుగులోకి వచ్చింది.
గుప్త నిధుల కోసం వెళ్లిన కొందరు యువకులు ఆ సొరంగ మార్గాన్ని చూశారు. అత్తాపూర్ ప్రాంతంలోని పురాతన కట్టడమైన ముశక్ మహల్ లో ఈ సొరంగం బయటపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు కూడా అక్కడి వెళ్తున్నారు. సొరంగం ఎక్కడి వరకు ఉంది అనేది ఇక తెలియలేదు. ఈ సొరంగ మార్గం ఎక్కడి వరకు వెళ్తుంది. అందులో ఏమున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ భారీగా నిధులు ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
గుప్త నిధుల కోసం కోసం ఆ పురాతన భవనంలోకి ఆ యువకులు వెళ్లారు. అలానే గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో అక్కడ కనిపించిన సొరంగం మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అలా లోపలికి వెళ్లిన యువకులకు సొరంగంలో 11 అడుగల నాగుపాము కనిపించింది. దీంతో యువకులు భయంతో బయటకి పరుగులు తీశారు. వారి శబ్ధానికి పాముకు కూడా బయటకు వచ్చి.. సమీపంలోకి పొదల్లోకి వెళ్లిపోయింది. బయటకు వచ్చిన 11 అడుగుల పాము దృశ్యాన్ని యువకులు తమ ఫోన్ లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.